Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-ఏడాది సంపాదన రూ.200 కోట్లు
న్యూఢిల్లీ: క్రికెట్ సూపర్‌స్టార్, భారత కెప్టెన్ విరాట్ కోహ్లి మరోసారి ఫోర్బ్స్ జాబితాలో నిలి చాడు. అత్యధక ఆదాయం ఆర్జిస్తున్న వరల్డ్ టాప్-100లో విరాట్ కోహ్లి చోటు సాధించాడు. ఫోర్బ్స్ జాబితాలో భారత్ నుంచి విరాట్ కోహ్లికి మాత్రమే చోటు దక్కింది. 26 మిలియన్ అమెరికన్ డాలర్లు (రూ.197.6 కోట్లు)తో విరాట్ కోహ్లి జాబితాలో 66వ స్థానంలో నిలిచాడు. ఇందులో రూ. 182.4 కోట్లను కోహ్లి వాణిజ్య ప్రకటనలు, కార్పోరేట్ ఒప్పందాల ద్వారా ఆర్జించాడు. రూ. 15.2 కోట్లను బీసీసీఐ వార్షిక వేతనం, మ్యాచ్ ఫీజులు, నగదు బహుమానాల ద్వారా సంపాదించాడు. రూ. 190 కోట్లతో 2019లో కోహ్లి 100వ స్థానంలో నిలువగా.. రూ. 182.4 కోట్లతో 2018లో 83వ స్థానంలో ఉన్నాడు. టెన్నిస్ దిగ్గజం, స్విస్ యోధుడు రోజర్ ఫెడరర్ రూ.807.88 కోట్ల ఆదాయంతో ఫోర్బ్స్ జాబితాలో అగ్రస్థానంలో నిలిచాడు. సాకర్ స్టార్స్ క్రిస్టియానో రొనాల్డో, లియోనల్ మెస్సీ తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
ఫోర్బ్స్ టాప్-10 : రోజర్ ఫెడరర్ (రూ.807.88 కోట్లు), క్రిస్టియానొ రొనాల్డో (రూ.798 కోట్లు), లియోనల్ మెస్సీ (రూ.790.4 కోట్లు), నెరుమార్ జూనియర్, లిబ్రాన్ జోన్స్, స్టిఫెన్ , కెవిన్ డిరాంట్, టైగర్ వుడ్స్, కిర్క్ కసిన్స్, కార్సన్ వెంట్జ్.