Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-ఫైనల్లో హైకర్స్పై 20 పరుగులతో గెలుపు
ఆర్నోస్వల్లే: కరేబియన్ లీగ్ విన్సీ టి10 ప్రిమియర్లీగ్ విజేతగా సునీల్ అంబ్రిస్ సారథ్యంలోని సాల్ట్ పాండ్ బ్రేకర్స్ జట్టు నిలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్లో లా సుఫ్రీ హైకర్స్ జట్టుపై 20 పరుగుల తేడా గెలిచింది. టాస్ గెలిచిన హైకర్స్్ జట్టు కెప్టెన్ మలానీ బౌలింగ్ ఎంచుకోవడంతో బ్రేకర్స్ జట్టు 10 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 100 పరుగులు చేసింది. ఆ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో హైకర్స్ జట్టు 6.1ఓవర్లలో 46 పరుగులు చేసి 7 వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. చివరి 12 బంతుల్లో 39 పరుగులు చేయాల్సిన దశలో 18 పరుగులే చేసి ఓడింది. దీంతో బ్రేకర్స్ జట్టు 20 పరుగుల తేడాతో గెలిచి ఆరంభ విన్సీ టి10 లీగ్ విజేతగా నిలిచింది. ఆసిఫ్ హూపర్స్ గ్రినెడినెస్ డివిర్స్ మూడోస్థానంలో నిలిచింది.