Authorization
Mon Jan 19, 2015 06:51 pm
లార్డ్స్ : కంగారూ జట్టులో రిటైర్మెంట్ల పరంపర కొనసాగుతోంది. తాజాగా స్టార్ ఆల్‌రౌండర్ షేన్ వాట్సన్ టెస్ట్ క్రికెట్ నుంచి వైదొలిగాడు. ఇంగ్లాండ్‌తో లార్డ్స్ వన్డే సందర్బంగా గాయపడిన వాట్సన్..వైద్య పరీక్షల అనంతరం తన నిర్ణయాన్ని ప్రకటించాడు. తనలో ఇంకెంత మాత్రం నిజమైన పోరాటతత్వం లేదని భావించినందునే వీడ్కోలు తీసుకుంటున్నానని వాట్సన్ తెలిపాడు. 2005లో టెస్ట్ క్రికెట్ ఆరంగేట్రం చేసిన షేన్ వాట్సన్ ఆసీస్‌కు ఆల్‌రౌండర్‌గా విలువైన సేవలందించాడు. కెరీర్లో 59 టెస్ట్ మ్యాచులాడిన వాట్సన్ 35.19 సగటుతో 3731 పరుగులు సహా 75 వికెట్లు నేలకూల్చాడు. గాయం కారణంగా ఇంగ్లాండ్‌తో మిగిలిన మూడు వన్డేలకూ వాట్సన్ దూరమయ్యాడు.