Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ట్విట్టర్ ఫాలోయింగ్‌లో
- సెరెనా తర్వాతి స్థానం సానియాదే
న్యూయార్క్ : యు.ఎస్.ఓపెన్ మహిళల డబుల్స్ ప్రీక్వార్టర్స్ మ్యాచ్ జరుగుతోంది. సోషల్ మీడియాలో మహిళల టెన్నిస్ స్టార్స్ ఫాలోయింగ్‌పై వ్యాఖ్యాతల ఆసక్తికర వ్యాఖ్య. ట్వీట్టర్లో వరల్డ్ నెం.1 సెరెనా విలియమ్స్ అత్యధిక ఫాలోవర్స్‌తో జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది. ఇక సెకండ్ పోజిషన్లో ఉన్న ప్లేయర్ పేరు చెప్పేముందు వ్యాఖ్యాత కొంత ఊరించాడమే కాదు అభిమానులు కాస్త ఆశ్చర్యపడతారనీ పేర్కొన్నాడు. రష్యా అందాల భామ మరియా షరపోవా, కెనడా సుందరీమణీ బౌచర్డ్, రోమేనియా రోమాంటిక్ గాళ్ సిమోన హలెప్ వంటి స్టార్స్‌కు రెండో స్థానం దక్కలేదు. ఇండియన్ ఐకాన్ ప్లేయర్, తెలంగాణ బ్రాండ్ అంబాసీడర్ సానియా మీర్జా 2.94 మిలియన్ అభిమానుల ఫాలోయింగ్‌తో రెండో స్థానంలో నిలిచింది. మహిళల డబుల్స్‌లో వరల్డ్ నెం.1 ర్యాంక్‌తో పాటు వింబుల్డన్‌లో హింగిస్‌తో కలిసి చాంపియన్‌గా అవతరించిన సానియా మీర్జా భారత్‌లో యూత్ ఐకాన్‌గా నిలిచిందని వ్యాఖ్యాతలు మీర్జాను పొగడ్తలతో ముంచెత్తారు. టెన్నిస్ వంటి గ్లోబల్ స్పోర్ట్‌లో స్టార్స్‌ను వెనక్కి నెట్టి సానియా 'సోషల్' గౌరవం దక్కించుకోవటం మనకూ గర్వకారణమే కదా..!