Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ొప్రీ క్వార్టర్స్‌లో ఫెడరర్, ముర్రే, అండర్సన్ ొలాస్ట్-16లో హలెప్, అజరెంక, క్విటోవా
సంచలనాలు లేవు. టాప్ సీడ్ల నిష్క్రమణ లేనే లేదు. స్టార్ ప్లేయర్స్ ఫెడరర్, ముర్రేలు అలవోకగా
ప్రీ క్వార్టర్స్‌లో కాలుమోపారు. ఉమెన్స్ సింగిల్స్‌లో హలెప్, క్విటోవా సైతం సునాయాసంగా
విజయం సాధించి ఆఖరి 16 మందిలో చోటు దక్కించుకున్నారు.
న్యూయార్క్ : స్టార్ టెన్నిస్ ప్లేయర్ రోజర్ ఫెడరర్ (స్విట్జర్లాండ్) మరో గ్రాండ్‌స్లామ్ దిశగా వడివడిగా అడుగులు వేస్తున్నాడు. మూడో రౌండ్లో సైతం అలవోక విజయం సాధిం చిన ఫెడరర్.. ప్రీ క్వార్టర్స్‌లో కాలుమోపాడు. జర్మనీ ఆటగాడు ఫిలిప్పై 6-3, 6-4, 6-4తో వరస సెట్లలో నెగ్గిన ఫెడరర్ ప్రీ క్వార్టర్స్‌లో లోకల్ స్టార్ జాన్ ఇస్నర్ (అమెరికా)తో తలపడను న్నాడు. బ్రిటన్ స్టార్ ఆండీ ముర్రే సైతం ప్రీ క్వార్టర్స్‌కు చేరుకు న్నాడు. రిచర్డ్ గాస్కెట్ (ఫ్రాన్స్), కెవిన్ అండర్సన్ (దక్షిణాఫ్రికా), థామస్ బెర్డిచ్ (చెక్ రిపబ్లిక్) కూడా మూడో రౌండ్లో విజయం సాధించారు. మహిళల సింగిల్స్ విభాగంలో సెకండ్ సీడ్ సిమోనా హలెప్ (రోమేనియా), విక్టోరియా అజరెంక (బెల్జియం), పెట్రా క్విటోవా (చెక్ రిపబ్లిక్), సబినా లిసికి (జర్మనీ)లు ప్రీ క్వార్టర్స్‌కు చేరారు.
సునాయాసంగా.. : మెన్స్ సింగిల్స్‌లో సంచలనాలకు విరామం..! స్విస్ యోధుడు రోజర్ ఫెడరర్ వరసగా మూడో మ్యాచ్‌లో జోరు కొనసాగించగా..బ్రిటన్ స్టార్ ముర్రే ఫామ్ అందుకున్నాడు. జర్మనీ ప్లేయర్ ఫిలిప్పై 6-3, 6-4, 6-4తో ఫెడరర్ ఏకపక్ష విజయం నమోదు చేశాడు. తొలి మూడు మ్యాచ్‌ల్లో అలవోక విజయాలు అందుకున్న ఫెడరర్..ప్రీ క్వార్టర్స్‌లో లోకల్ స్టార్ జాన్ ఇస్నర్ రూపంలో సవాల్ ఎదుర్కొనున్నాడు. రెండో రౌండ్లో అతికష్టం మీద గట్టెక్కిన ఆండీ ముర్రే తాజా మ్యాచ్‌లో ఫామ్ అందుకున్నాడు. వరస సెట్లలో విజయం సాధించి కీలక మ్యాచ్‌లకు ముందు ఆత్మవిశ్వాసం సంపాదించాడు. థామస్ బెల్లుచి బ్రెజిల్)పై 6-3, 6-2, 7-5తో విజయం సాధించాడు. తొలి రెండు సెట్లలో భారీ తేడా చూపించిన ముర్రేకు మూడో సెట్లో తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. కానీ వరుసగా రెండు బ్రేక్ పాయింట్లు సాధించిన ముర్రే 3-0తో ప్రీ క్వార్టర్స్ బెర్త్ ఖాయం చేసుకున్నాడు. రిచర్డ్ గాస్కెట్ (ఫ్రాన్స్) 6-4, 6-3, 6-1తో స్పెయిన్ ప్లేయర్ లొపెజ్‌ను ఖంగు తినిపించాడు. ఆరో సీడ్ థామస్
బెర్డిచ్ (చెక్ రిపబ్లిక్) 6-7 (2-7), 7-6(9-7), 6-3, 6-3తో హోరా హోరి పోరులో పైచేయి సాధించాడు. తొలి రెండు సెట్లు టైబ్రేక్‌కు దారితీయగా.. తర్వా తి రెండు సెట్లలో బెర్డిచ్ సత్తా చాటాడు. దక్షిణాఫ్రికా ప్లేయర్ కెవిన్ పీటర్సన్ కూడా ప్రీ క్వార్టర్స్ బెర్త్ ఖాయం చేసుకున్నాడు. 6-3, 7-6(7-3), 7-5(7-3)తో డొమిక్ థిమ్ (ఆస్ట్రియా)పై గెలుపొందాడు.
మహిళల సింగిల్స్‌లో రేసులో నిలిచిన స్టార్స్ విజయాలు నమోదు చేశారు. రెండో సీడ్ ప్లేయర్ సిమోన హెలెప్ (రోమేనియా) 6-2, 6-3తో షెల్బీ రోగర్స్ (అమెరికా)పై గెలుపొందింది. బెల్జియం భామ విక్టోరియా అజరెంక ప్రీ క్వార్టర్స్ బెర్త్ ఖాయం చేసుకుంది. 7-5, 2-6, 6-4తో జర్మనీ ముద్దుగుమ్మ కెర్బర్‌పై విజయం సాధించింది. 1-1తో సమవుజ్జీలుగా నిలిచిన స్థితిలో నిర్ణయాత్మక సెట్లో సత్తా చాటిన అజరెంక లాస్ట్-16 జాబి తాలో నిలిచింది. ఐదో సీడ్ పెట్రా క్విటావో సైతం అలవోక విజయంతో ముందంజ వేసింది. చెక్ రిపబ్లిక్కు చెందిన ఈచిన్నది 6-2, 6-1తో విజయం సాధించింది. ఉష్ణతాప వాతావరణంలో సుదీర్ఘ మ్యాచ్‌లో నెగ్గి రికార్డు నెలకొల్పిన బ్రిటన్ భామ జొహన్న కాంట తొలిసారి ప్రీ క్వార్టర్స్‌లో అడుగుపెట్టింది. 7-6(7-2), 6-3తో వరుస సెట్లలో సారా ఎర్రానీ (ఇటలీ)పై గెలుపొందింది.