Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-బెన్‌స్టోక్స్‌కు నాయకత్వం అవకాశం
సౌతాంప్టన్ (ఇంగ్లాండ్) : ఇంగ్లాండ్ టెస్టు కెప్టెన్, స్టార్ బ్యాట్స్‌మన్ వెస్టిండీస్‌తో తొలి టెస్టుకు దూరం కానున్నాడు. కరోనా వైరస్ నేపథ్యంలో బయో సెక్యూర్ బబుల్ వాతావరణంలో ఇంగ్లాండ్, వెస్టిండీస్‌లు మూడు టెస్టుల సిరీస్ ఆడనున్న సంగతి తెలిసిందే. టెస్టు సిరీస్ కోసం ఇంగ్లాండ్ ఇప్పటికే ప్రాక్టీస్ మొదలు పెట్టింది. ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్ సౌతాంప్టన్‌లో తొలి టెస్టుకు దూరం కానున్నాడు. జులై 8న ఆరంభం కానున్న తొలి టెస్టుకు అందుబాటులో ఉండలేనని జో రూట్ ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డుకు సమాచారం ఇచ్చాడు. వైస్ కెప్టెన్, స్టార్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్‌కు తొలిసారి ఇంగ్లీష్ జట్టుకు నాయకత్వం వహించే అవకాశం ఏర్పడింది. జో రూట్ సతీమణి తొలి టెస్టు సమయంలోనే రెండో బిడ్డకు జన్మనివ్వనుంది. ప్రసవ సమయంలో భార్యతో ఉండేందుకు రూట్ తొలి టెస్టులో ఆడటం లేదు. ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ సహజ నాయకుడని, తొలి టెస్టులో ఇంగ్లాండ్‌ను నడిపిస్తాడని రూట్ విశ్వాసం వ్యక్తం చేశాడు. ' ఇంగ్లాండ్‌కు కెప్టెన్సీ వహించేందుకు బెన్ స్టోక్స్‌కు అన్ని అర్హతలు ఉన్నాయి. అతను సహజ నాయకుడు' అని జో రూట్ అన్నాడు.