Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కరోనా వైరస్ మహమ్మారి ప్రపంచ క్రికెట్లో పలు మార్పులకు కారణం అవుతోంది. కోవిడ్-19 ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా క్రికెట్లో ఉమ్మిపై నిషేధం సైతం విధించారు. గతంలో మాదిరి మైదానంలోకి అడుగుపెట్టే ముందు జట్టంతా ఒకరి భుజాలపై చేతులేసుకుని గుంపుగా చేరి మాట్లాడుకోవటం ఇక చూడలేం. వికెట్ పడినప్పుడు ఆటగాళ్లందరూ బౌలర్‌ను హత్తుకుని అభినందించటం ఇక కొంత కాలం చరిత్రే!. బ్యాట్స్‌మన్ బౌండరీలు, అర్థ సెంచరీ, శతకం బాదినప్పుడు సహచర బ్యాట్స్‌మన్ ఆలింగం, అభినందనలు ఇక ఉండకపోవచ్చు. ఇంగ్లాండ్‌తో సిరీస్‌కు వెస్టిండీస్ ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో అంతర్గత మూడు రోజుల మ్యాచ్ ఆడుతున్నారు. ఈ సందర్భంగా వెస్టిండీస్ క్రికెటర్లు సరికొత్త రీతిలో సహచరులతో సంబరాలు చేసుకుంటున్నారు. వికెట్ పడగొట్టిన మార్కినో మిండ్లీతో జాన్ కాంప్‌బెల్ ఇలా సెలబ్రేట్ చేసుకున్నాడు.