Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నూతన షెడ్యూల్ ప్రకటించిన సీఎస్ఏ
జొహనెస్‌బర్గ్ : క్రికెట్ దక్షిణాఫ్రికా (సీఎస్ఏ) ప్రయోగాత్మకంగా తీసుకొస్తున్న 3టీమ్ క్రికెట్ మ్యాచ్‌కు నూతన షెడ్యూల్ విడుదలైంది. తొలుత జూన్ 27న నిర్వహించాలని భావించినా.. దక్షిణాఫ్రికాలో కోవిడ్-19కు సెంచూరియన్ హాట్‌స్పాట్‌గా ఉండటంతో ప్రభుత్వ అనుమతులు లభించలేదు. తాజాగా క్రికెట్ మ్యాచుల నిర్వహణకు దక్షిణాఫ్రికా క్రీడా, ఆరోగ్య శాఖలు అనుమతి ఇవ్వటంతో సీఎస్ఏ జాతీయ మెన్స్, ఉమెన్స్ జట్లు ప్రాక్టీస్‌లో నిమగమయ్యాయి. ఏబీ డివిలియర్స్, కగిసో రబాడ, క్వింటన్ డికాక్‌లు కెప్టెన్లుగా సీఎస్ఏ 3టీసీఎం సొలిడారిటీ కప్‌కు రూపకల్పన చేసిన సంగతి తెలిసిందే. 36 ఓవర్ల మ్యాచ్‌లో ప్రతి జట్టు 12 ఓవర్లు బ్యాటింగ్ చేస్తుంది, మరో 12 ఓవర్లు బౌలింగ్ చేస్తుంది. అందులో ఆరేసి ఓవర్లు భిన్న ప్రత్యర్థులను ఎదుర్కొవాల్సి ఉంటుంది. కరోనా వైరస్ విరామం అనంతరం దక్షిణాఫ్రికా క్రికెట్లో విప్లవాత్మక ఫార్మాట్‌తో అభిమానుల ముందుకు రానున్నారు. స్టేడియంలో అభిమానుల ప్రవేశానికి ప్రస్తుతానికి అనుమతులు లేకపోయినా... మ్యాచ్ సమయానికి పరిస్థితులు మారే అవకాశం కనిపిస్తోంది.