Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-రేసులో గంగూలీ పేరుపై ఆసక్తి
న్యూఢిల్లీ : ఐసీసీతో పరోక్షంగా ప్రచ్ఛన్న యుద్ధం చేస్తోన్న బీసీసీఐ ఎట్టకేలకు ఊపిరీపీల్చుకుంది. ఐసీసీలో భారత క్రికెట్ ప్రయోజనాలకు గండి కొట్టిన శశాంక్ మనోహర్ బుధవారం ఐసీసీ తొలి ఇండిపెండెంట్ చైర్మన్ పదవి నుంచి వైదొలిగాడు. బీసీసీఐ మాజీ బాస్ ఐసీసీ నుంచి తప్పుకోవటంతో.. మళ్లీ వరల్డ్ క్రికెట్ బాడీలో తన పరపతి పెంచుకునేందుకు భారత బోర్డు ప్రణాళిక రచిస్తోంది. మనోహర్ వైదొలగటంతో, తదుపరి ఐసీసీ చైర్మన్ ఎవరనే చర్చ మొదలైంది. ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) మాజీ చైర్మన్ కొలిన్ గ్రేవ్స్ రేసులో ముందున్నారు. బీసీసీఐ బరిలో లేకుంటే భారత్, ఆస్ట్రేలియా మద్దతు సైతం కొలిన్ గ్రేవ్స్కు లభించనుంది. క్రికెట్ దక్షిణాఫ్రికా మద్దతు అతనికి లేకపోవటం ప్రతికూలం. జులై 27తో పదవీ కాలం ముగించుకోనున్న సౌరవ్ గంగూలీ, సుప్రీంకోర్టు అనుమతి కోసం ఎదురుచూస్తున్నాడు. సడలింపులు లేకుంటే, ఐసీసీ చైర్మన్ రేసులో సౌరవ్ గంగూలీ నిలిచే అవకాశం కనిపిస్తోంది. సౌరవ్ గంగూలీ రేసులో నిలిస్తే అతనికి ఎటువంటి పోటీ ఉండే అవకాశం లేదు. పోటీ చేయటంపై గంగూలీ ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. పోటీలో నిలువటంపై గంగూలీ ఇంకా తన నిర్ణయాన్ని చెప్పలేదు. తాత్కాలిక చైర్మన్, సింగపూర్ క్రికెట్ సంఘం అధ్యక్షుడు ఇమ్రాన్ ఖవాజా, వెస్టిండీస్ క్రికెట్ బోర్డు మాజీ అధ్యక్షుడు డేవ్ కామెరూన్లు సైతం ఆశావహుల జాబితాలో ఉన్నారు.