Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ నాసిర్ హుస్సేన్
లండన్ : క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌పై ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ నాసిర్ హుస్సేన్ ప్రశంసలు గుప్పించాడు. మాస్టర్ బ్లాస్టర్ బ్యాట్స్‌మన్ 'మాగ్నిఫిషియెంట్ టెక్నిక్'తో ప్రత్యర్థులను చీల్చి చెండాడని అభిప్రాయపడ్డాడు. సంప్రదాయ క్రికెట్ షాట్లతో ప్రత్యర్థి బౌలర్లకు నిద్ర లేని రాత్రులు మిగిల్చిన సచిన్ టెండూల్కర్‌ను అవుట్ చేసేందుకు అన్ని జట్లు మెరుగైన వ్యూహం కోసం ప్రయత్నించాయి. కానీ ఏ జట్టూ పెద్దగా విజయవంతం కాలేదు. ఇంగ్లాండ్ జట్టు సైతం సచిన్ కోసం లెక్కలేనన్ని జట్టు సమావేశాలు నిర్వహించిందని హుస్సేన్ తెలిపాడు. ' ఓవరాల్‌గా ఆల్‌టైమ్ గ్రేట్ బ్యాట్స్‌మన్ సచిన్ టెండూల్కర్ గురించి మాట్లాడాల్సి వస్తే.. అతడికి మాగ్నిఫిషియెంట్ టెక్నిక్. నేను ఇంగ్లాండ్ కెప్టెన్‌గా ఉన్నప్పుడు సచిన్‌ను అవుట్ చేసేందుకు ఎన్ని సమావేశాలు నిర్వహించానో గుర్తేలేదు. కేవలం సచిన్ కోసమే జట్టు ప్రత్యేకంగా వ్యూహం సిద్ధం చేసేందుకు సమావేశమయ్యేది' అని నాసిర్ హుస్సేన్ వెల్లడించాడు.