Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నిర్లక్య్ష డ్రైవింగ్‌తో ఓ వ్యక్తి మరణం
కొలంబో : శ్రీలంక క్రికెటర్ కుశాల్ మెండిస్‌ను ఆదివారం పోలీసులు అరెస్టు చేశారు. ఆదివారం ఉదయం తన వాహనంలో రోడ్డుపైకి వచ్చిన మెండిస్.. సైక్లిస్ట్‌ను ఢకొీట్టాడు. ఈ ప్రమాదంలో 64 ఏండ్ల సైక్లిస్ట్ మృతిచెందాడు. దీంతో క్రికెటర్ కుశాల్ మెండిస్‌ను పోలీసులు అరెస్టు చేశారు. దక్షిణ కొలంబోలోని పనాదురలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. స్థానిక నివాసితుడైన సైక్లిస్ట్‌కు తీవ్ర గాయాలు అయ్యాయి. సకాలంలో ఆసుపత్రికి తీసుకెళ్లినా, ప్రయోజనం దక్కలేదు. పోలీసులు రానున్న 48 గంటల్లో మెండిస్‌ను పనాదుర మెజిస్ట్రేట్ ముందు హాజరుపర్చనున్నారు. ప్రాథమిక దర్యాప్తులో కుశాల్ మెండిస్, మృతి చెందిన స్లైక్లిస్ట్లలో ఎవరూ ఆల్కహాల్ ప్రభావంలో లేరని పోలీసులు తేల్చారు. శ్రీలంక విధించిన లాక్డౌన్ ఇటీవల ఎత్తివేశారు. రెసిడెన్షియల్ ట్రైనింగ్ క్యాంప్‌లో పాల్గొన్న కుశాల్ మెండిస్, క్యాంప్ ముగియటంతో బుధవారమే ఇంటికి చేరుకున్నాడు.