Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
హైదరాబాద్ లోని నేషనల్ జియోఫిజికల్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఎన్జీఆర్ఐ)లో కాంట్రాక్ట్ పద్ధతిపై 66 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. వీటిలో ప్రాజెక్ట్ అసోసియేట్ 45, ప్రాజెక్ట్ సైంటిస్ట్ 18, ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టులు మూడు వరకు ఉన్నాయి. అభ్యర్థులు ఈ నెల 25లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలనీ, పూర్తి సమాచారం కోసం షషష.అస్త్రతీఱ.శీతీస్త్ర.ఱఅ ని సందర్శించవచ్చని శనివారం ఒక ప్రకటనలో పేర్కొంది.