Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గాంధీలో కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ సిబ్బంది విధుల బహిష్కరణ
నవతెలంగాణ - సిటీబ్యూరో
కాంట్రాక్టు, ఔటు సోర్సింగ్ సిబ్బంది మరోసారి నిరసన చేపట్టారు. హైదరాబాద్లోని గాంధీ మెడికల్ కళాశాల ఎదుట ధర్నా చేశారు. తమకు ఇచ్చిన హామీని నిలబెట్టు కోవాలని డిమాండ్ చేస్తూ విధులను బహిష్క రించారు. మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం బైటాయిం చారు. రోజుకు రూ.300 ఇన్సెంటీవ్ ఇస్తామన్న హామీని నిలబెట్టుకోవాలన్నారు. ప్రతినెలా ఐదో తేదీలోపు జీతాలివ్వా లన్నారు. జీఓ 68 ప్రకారం వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. న్యాయం జరిగేవరకు పోరాడుతామని తెలంగాణ యునైటెడ్ మెడికల్Êహెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర జిల్లా ప్రధాన కార్యదర్శి యాదానాయక్, సుధాకర్ అన్నారు.