Authorization
Mon Jan 19, 2015 06:51 pm
• మంజూరు చేసిన రుణాల కోసం రోజుల తరబడి వేచి చూసే బదులుగా కొద్ది గంటల్లోనే పొందవచ్చు
• వ్యవసాయ ఉత్పత్తులను సంస్కరణ చేసే వారు, వ్యాపారులు మరియు రైతులకు సమయం మరియు ఖర్చులను ఆదా చేస్తుంది
హైదరాబాద్: బ్యాంకింగ్ రంగంలోనే మొదటిసారిగా, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ నేడు వేర్‌హౌస్ కమోడిటీ ఫైనాన్స్ యాప్‌ను ప్రారంభించింది. భౌతిక జోక్యం లేదా బ్యాంకు శాఖలకు పలుసార్లు సందర్శించే అవసరం లేకుండా ఆన్లైన్లోనే తమ గోదాములో ఉన్న ఉత్పత్తులను తనఖా పెట్టి రుణాన్ని తీసుకునేందుకు ఇది వినియోగదారులకు అవకాశం కల్పిస్తుంది. ఇది వ్యవసాయ ఉత్పత్తుల సప్లయి చెయిన్‌కు మరింత మెరుగైన సామర్థ్యాలను అందిస్తూ, విలువైన సమయాన్ని ఆదా చేస్తుంది. గతంలో మంజూరైన రుణం చేతికి అందేందుకు రోజుల సమయం తీసుకునేది కాగా, దీనితో ఇప్పుడు కొద్ది సమయంలోనే వినియోగదారునికి అందుతుంది. వేర్‌హౌస్ రిసిప్ట్ లోన్స్ (WHR loans)కు ప్రాథమిక లబ్దిదారులుగా రుణాలను తీసుకునేందుకు అర్హత కలిగిన వ్యవసాయ ఉత్పత్తులను సంస్కరణ చేసేవారు, వ్యాపారులు మరియు రైతులకు ఈ నూతన యాప్ అత్యుతమంగా సహకరిస్తుంది.
భారతదేశంలో ప్రయాణాలపై నిబంధనలు, పరిమితులు కొనసాగుతూ, పలు ప్రాంతాలు అన్‌లాక్ అవుతున్న సమయంలో ఈ యాప్‌ను అందుబాటులోకి తీసుకు వచ్చారు. ఇటువంటి సమయంలో ఆర్థిక పునరుజ్జీవనానికి కీలకంగా నిలిచిన వ్యవసాయ పరిశ్రమ ఎటువంటి అడ్డంకులు లేకుండా పని చేయవలసి ఉంటుంది. వస్తువులను నిలువ చేసే గోదాములు, మార్కెట్‌కు స్థిరంగా వస్తువుల పంపిణీను నిర్ధారించడం ద్వారా, అనిశ్చిత ఆర్థిక వాతావరణంలో, ముఖ్యంగా బియ్యం, గోధుమలు, సోయా బీన్, పత్తి, పప్పు ధాన్యాలు మరియు నూనె గింజలు తదితర ధరల్లో హెచ్చు తగ్గులు లేకుండా చూసేందుకు, ధరల స్థిరత్వాన్ని కాపాడటానికి సహకరిస్తుంది. గోదాముల ఫైనాన్సింగ్ ఈ వ్యాపారానికి జీవనాడి, ఎందుకంటే బ్యాంకులు సురక్షితంగా నిలువ చేసిన ఈ వస్తువులపై రుణాలు మంజూరు చేయగలవు. అదే విధంగా, రుణాన్ని తిరిగి చెల్లించినప్పుడు, తాకట్టు పెట్టిన వ్యవసాయ ఉత్పత్తులు డిజిటల్‌గా విడుదల చేయబడతాయి. ఇది సకాలంలో సరుకుల పంపిణీకి, వ్యవసాయ ప్రాసెసింగ్‌కు సకాలంలో వినియోగించేందుకు సహాయపడుతుంది.
Click here to watch the video.
“మహమ్మారి నేపథ్యంలో బ్యాంకు శాఖలకు పలుసార్లు సందర్శించలేకపోతున్న సమయంలో ఈ యాప్‌ను ప్రారంభించడం మాకు సంతోషంగా ఉంది. పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో ఉంటున్న ప్రజలు గోదాముల్లోని ఉత్పత్తులను ఆన్లైన్లో సమర్థవంతంగా తాకట్టు పెట్టుకుంటున్న సదుపాయాన్ని వినియోగించుకుంటున్నందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. బ్యాంకుగా మేము అగ్రి వ్యాల్యూ చెయిన్ సామర్థ్యాన్ని మెరుగుపరిచేందుకు నిరంతరం ప్రయత్నిస్తున్నాము. సేవల్లో విలువను జోడించడం, వేర్‌హౌస్ కమోడిటీ ఫైనాన్స్ యాప్ ప్రాతిపదికన వినియోగదారుల విలువైన ఫీడ్‌బ్యాక్ తదితర డిజిటల్ ఆఫరింగ్‌లను మేము కొనసాగిస్తాము. ఇటువంటి ఆవిష్కరణలు అగ్రి ఫైనాన్సింగ్‌కు భవిష్యత్తు అని మేము విశ్వసిస్తున్నామని’’ హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ బిజినెస్ బ్యాంకింగ్ హెడ్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ సుమంత్ రాంపాల్ అన్నారు.
హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ నుంచి గోదాము రసీదు/ కమోడిటీ ప్లెడ్జ్ రుణాన్ని పొందే బ్యాంక్ ప్రస్తుత మరియు నూతన ఖాతాదారులకు ఈ యాప్‌ను వినియోగించుకునేందుకు అవకాశం ఉంటుంది. ఇప్పటికే రుణాలు మంజూరైన ప్రస్తుత కస్టమర్లు కేవలం 3 సాధారణ స్టెప్‌లలో యాప్‌కు లాగిన్ కావడం ద్వారా దీని సేవలను అందుకోవచ్చు మరియు నూతన ఖాతాదారులు హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ నుంచి మంజూరు చేసిన ప్లెడ్జ్ రుణాన్ని పొందవచ్చు మరియు వేర్‌హౌస్ కమోడిటీ ఫైనాన్స్ యాప్ కోసం రిజిస్టర్ చేసుకోవచ్చు.
వేర్‌హౌస్ ఫానాన్స్ యాప్‌ను ఇన్స్టాల్ చేసుకుని, వినియోగించుకునేందుకు సులభమైన 3 స్టెప్లు:
• ప్లేస్టోర్ నుంచి వేర్‌హౌస్ కమోడిటీ ఫైనాన్స్ యాప్‌ను డౌన్లోడ్ చేసుకుని, ఇన్స్టాల్ చేయండి.
• రుణం మంజూరు చేసిన సమయంలో ఇచ్చిన రిజిస్ట్రేషన్ నంబర్ ద్వారా లాగిన్ అవ్వండి
• ఓటీపీని జనరేట్ చేయండి మరియు పాస్‌వర్డ్‌ను సెట్/రీసెట్ చేసుకోండి
కీలక ప్రత్యేకతలు
• ప్లెడ్జ్ చేసే స్టోరేజ్ రిసిప్ట్స్‌కు సంబంధించి రియల్ టైమ్ సమాచారం అందుబాటులో ఉంటుంది.
• నిధులను పొందేందుకు ఆన్లైన్లో పంపిణీ చేయాలని అభ్యర్థించుకోవచ్చు
• పాక్షికంగా/పూర్తిగా రుణం తిరిగి చెల్లించడం మరియు స్టాక్‌ను విడుదల చేయించకోవడం
• యాప్ ద్వారా కాసా ఖాతా నుంచి ఆన్లైన్లో చెల్లింపు
• మెచ్యూరిటీ సమాచారంతో పాటు 24/7 లోన్ స్టేట్మెంట్
• గత లావాదేవీలకు సంబంధించిన సమాచారం
Click here to download the app on android
ఈ యాప్ ప్రత్యేకంగా దృఢమైన వ్యవసాయ పరిశ్రమలు ఉన్న పంజాబ్, హరియాణా, రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ మరియు గుజరాత్ రాష్ట్రాల్లోని వినియోగదారులకు ఉపయోగపడుతుంది.
హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ దేశంలోని 2వ అతి పెద్ద ఎంఎస్ఎంఇ బ్యాంక్ కాగా, సెమీ అర్బన్ మరియు రూరల్ మార్కెట్లలో 45% ఎంఎస్ఎంఇ వాటాతో అగ్రి వాల్యూ చైన్‌కు పూర్తిగా మద్దతు ఇస్తోంది.
About HDFC Bank
To know more about HDFC Bank, log on to www.hdfcbank.com.