Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఫారం-18 ద్వారా దరఖాస్తు చేసుకోవాలి
- నవంబర్ 1 అర్హత తేదీగా ఓటర్ జాబితా : ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్
అధికారి ఎస్.పంకజ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
మహబూబ్నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ పట్టభద్రుల నియోజకవర్గం ఫొటో ఓటరు నమోదు ప్రక్రియను బుధవారం నుంచి నవంబర్ ఆరో తేదీ వరకు చేపట్టనున్నట్టు ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ ఎస్.పంకజ ఒక ప్రకటనలో తెలిపారు. భారత ఎన్నికల కమిషన్ సూచనల ప్రకారం కొత్త ఓటర్ల జాబితాను నవంబర్ ఒకటో తేదీని అర్హత తేదీగా నిర్ణయించామని పేర్కొన్నారు. గ్రాడ్యుయేట్లు తమ పేర్లను ఫారం-18 ద్వారా నమోదు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తుదారులు పట్టభద్రుల నియోజకవర్గ పరిధిలో నివాసం ఉంటున్న వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని తెలిపారు. దరఖాస్తుదారు అర్హత తేదీ నవంబర్ ఒకటో తేదీ నాటికి కనీసం మూడేండ్ల ముందు డిగ్రీ పట్టా పొంది ఉండాలని సూచించారు. ఫారం-18ని పూర్తిచేసి దానికి ఇటీవల తీసుకున్న పాస్పోర్ట్ సైజు ఫొటోను అతికించాలనీ, అలాగే అభ్యర్థి విద్యార్హతకు సంబంధించిన డిగ్రీ, డిప్లమా సర్టిఫికేట్, మార్క్స్ షీట్, ఇతర ధ్రువీకరణ పత్రాలపై డిజిగేటెడ్ ఆఫీసర్, గెజిటెడ్ ఆఫీసర్, నోటరీ పబ్లిక్ అటిస్టెడ్ చేయించి జతచేయాలని సూచించారు. ఆన్లైన్లో సీఈఓ వెబ్సైట్ అయిన www.ceotelangana.nic.in ద్వారా కూడా పట్టభద్రులు ఓటర్గా నమోదు చేసుకోవచ్చునని తెలిపారు. గతంలో పట్టభద్రుల నియెజక వర్గ ఓటరుగా ఉన్నవారు కూడా తాజాగా దరఖాస్తు చేసుకోవాలనీ, గ్రాడ్యుయేట్ ఎలక్టోరల్ రోల్ ఎప్పటిక ప్పుడు కొత్తగా రూపొందిస్తామని పేర్కొన్నారు. మహబూబ్ నగర్ - రంగారెడ్డి - హైదరాబాద్ పట్టభద్రుల నియోజక వర్గం పరిధిలోని 9 జిల్లాల్లోని ఆర్డీఓలు, తహసీల్దార్లు, డిప్యూటీ కమిషనర్లలను అసిస్టెంట్ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్లుగా నియమించినట్టు తెలిపారు. డిప్యూటీ తహసీల్దార్లు, అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్లను డిజిగేటెడ్ ఆఫీసర్లుగా నియమించినట్టు వివరించారు. అర్హులైన పట్టభద్రులు తాము పూర్తిచేసిన ఫారం-18 దరఖాస్తులను అసిస్టెంట్ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్లు, డిజిగేటెడ్ ఆఫీసర్లకు అందజేయవచ్చునని తెలిపారు.బల్క్ దరఖాస్తులు, పోస్ట్ద్వారా వచ్చే దరఖాస్తులను స్వీకరించబోమని స్పష్టం చేశారు.
ఫారం-18 ప్రకారం దరఖాస్తులు స్వీకరణకు చివరి తేదీ 06-11-2020
ఎలక్టోరల్ రోల్స్ డ్రాప్ట్ పబ్లికేషన్ తేదీ 01-12-2020
క్లైయిమ్లు, అభ్యంతరాల స్వీకరణ: 01-12-2020 నుంచి 31-12- 2020 వరకు
క్లైమ్లు, అభ్యంతరాల డిస్పోజల్ తేదీ: 12-01-2021
గ్రాడ్యుయేట్ నియోజకవర్గ ఎలక్టోరల్ రోల్ ఫైనల్ పబ్లికేషన్ తేదీ: 18-01-2021