Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో వచ్చే మూడు రోజులూ వానలు కురిసే అవకాశం ఉంది. అయితే, చాలా ప్రాంతాల్లో తేలిక పాటి నుంచి మోస్తరు వర్షం పడొచ్చు. సోమ, మంగళవా రాల్లో పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశమున్నట్టు హైదరా బాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరానికి దగ్గరలో పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో 1.5 కిలోమీటర్ల ఎత్తు మేరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నది. తూర్పు మధ్య బంగాళాఖా తం, దాని పరిసర ప్రాంతాలలో 2.1 కిలోమీటర్ల నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు వరకు ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావం వలన రాగల 24 గంటలలో అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశముంది. ఆ తర్వాత 24 గంటలలో మరింత బలపడొచ్చని అధికారులు తెలిపారు.