Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అమరావతి: తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎల్.రమణ రెండోసారి నియమితులయ్యారు. ఈ మేరకు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సోమవారం కమిటీలను ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా కింజరాపు అచ్చెన్నాయుడు నియమితులయ్యారు. అదేవిధంగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా మరోసారి నారా లోకేశ్ నియమితులయ్యారు. 27 మంది సభ్యులతో టీడీపీ కేంద్ర కమిటీని, మరో 25 మందితో పొలిట్ బ్యూరో ఏర్పాటు చేసినట్టు ప్రకటించారు. 31 మందితో తెలంగాణ టీడీపీ రాష్ట్ర కమిటీని ఏర్పాటు చేశారు. ఆరుగురు సభ్యులతో తెలంగాణా టీడీపీ సమన్వయ కమిటీని నియమించారు.