Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇంజనీరింగ్ విద్యాలో ఉత్తమ ఫలితాల్లో నంబర్ వన్
- వేలాది మంది విద్యార్థుల సొంతం
- ఇన్స్టిట్యూట్ ఆప్ ఎరోనాటికల్ ఇంజనీరింగ్ పెట్టిందిపేరు
నవతెలంగాణ-సిటీబ్యూరో
విజ్ఞతకు, విద్యా సంపదకు కేరాఫ్ అడ్రస్‌గా చెప్పుకునే ఐఏఆర్ఈ ఏరోనాటికల్ ఇంజనీరింగ్‌లో అగ్రగామిగా నిలిచింది. 16.72ఎకరాల్లో సువిశాలమైన క్యాంపస్, డిజిటల్ లైబ్రరీతో హైదరాబాద్‌లో 2000 సంవత్సరంలో స్థాపించారు. దేశంలోని 300 బెస్ట్కాలేజీలో స్థానం దక్కించుకుంది. ఈ సంస్థ 'మారుతి ఎడ్యుకేషనల్ సొసైటీ' ఆధ్వర్యంలో కొనసాగుతోంది. దీనిని ''ఎడ్యుకేషన్ ఫర్ లిబరేషన్'' అనే మిషన్‌తో విద్యావ్యవస్థలో సుదీర్ఘమైన, అత్యుత్తమ అనుభవం కలిగిన ప్రముఖ పారిశ్రామికవేత్తల బందం ఏర్పాటు చేసింది. తెలంగాణ రాష్ట్రంలో ఏరోనాటికల్ ఇంజనీరింగ్ విభాగంలో బీటెక్ ప్రోగ్రాంను మొదటగా ప్రారంభించిన ఈ సంస్థ క్రమంగా సమగ్ర బహుళ-క్రమశిక్షణా సాంకేతిక సంస్థగా మారిపోయింది. ఏరోనాటికల్ ఇంజనీరింగ్‌లో 4952 మంది విద్యార్థులుండగా, 275 మంది అత్యుత్తమమైన ఫ్యాకాల్టి ఉంది. 30శాతం మంది పీహెచ్డీ చేసిన బృందంతో కొనసాగుతోంది. రెండు స్టుడియోలు, 6 సెమినార్ హాల్స్, 4 కాన్ఫరెన్స్ రూంలున్నాయి. కాలేజీకి వచ్చేందుకు 31 బస్సులు అందుబాటులో ఉన్నాయి. విద్యార్థీనీ విద్యార్థులకు ప్రత్యేక హాస్టల్ సదుపాయాలున్నాయి.
విద్యాసంస్థకు కేరాఫ్‌గా...
విద్యార్థినీ విద్యార్థుల మెథస్సుకు విద్యా సంపదకు కేరాఫ్ అడ్రస్స్‌గా మారిన ఈ సంస్థ హైదరాబాద్‌లోని దుండిగల్‌లో నెలకొల్పారు. ఐఏఆర్ఈ ఒక అటానమస్ ఇంజనీరింగ్ కళాశాల. చైర్మన్‌గా మర్రి రాజశేఖర్ రెడ్డి ఉండగా, సెక్రటరీ అండ్ కరస్పాండెంట్‌గా సీహెచ్ సత్తిరెడ్డి ఉన్నారు. ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్‌గా అండ్ ట్రెజరర్ బి.రాజశ్వేర్రావు, ప్రిన్సిపాల్ ఆఫ్ ఐఏఆర్ఈగా డాక్టర్ ఎల్.వి.నర్సింహాప్రసాద్ కొనసాగుతున్నారు.
'ఏ'గ్రేడ్‌గా గుర్తింపు
ఐఏఆర్ఈ ఒక ప్రతిష్టాత్మక అటానమస్ ఇంజనీరింగ్ కళాశాల. ఈ కాలేజీలో ఏడు ఇంజనీరింగ్ కోర్సులున్నాయి. సీఎస్ఈ, ఐటీ, ఈసీఈ, ఈఈఈ, ఏరోనాటికల్, మెకానికల్ మరియు సివిల్ ఇంజనీరింగ్ కోర్సులు ఉన్నాయి. ఎంటెక్ విభాగంలో ఆరు కోర్సులు ఉన్నాయి. 18 సంవత్సరాల నుంచి సంస్థ ఉత్తమ ప్రమాణాలతో విద్యనందిస్తూ దేశంలోనే పేరుత్రిష్టలను సంపాదించిది. సంస్థను ఎఐసీిటీఈ(న్యూఢిల్లీ) అనుమతి పొందింది. ఈ సంస్థకు తెలంగాణ రాష్ట్రంలో జవహర్లాల్ నెహ్రూ టెక్నలాజి యూనివర్శిటీ హైదరాబాద్ (జెఎన్‌టియుహెచ్) గుర్తింపు ఉంది. నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడిటేషన్ కౌన్సిల్ (నాక్) చేత 'ఏ' గ్రేడ్‌తో గుర్తింపు పొందింది. ఏడు బీటెక్ ప్రోగ్రామ్‌లకు 2008 నుంచి నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రిడిటేషన్ (ఎన్బీఎ) చేత మూడుసార్లు గుర్తింపు పొందింది. యూజీసీ చట్టం సెక్షన్లు 2 (ఎఫ్) మరియు 12 (బి) కింద ఈ సంస్థకు గుర్తింపు కూడా లభించింది.
అత్యుత్తమ ఇంజనీరింగ్ సంస్థగా గుర్తింపు
నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్ (ఎన్ఐఆర్ఎఫ్)-2019 గుర్తింపు వచ్చింది. దేశంలో మానవ వనరుల అభివద్ధి మంత్రిత్వ శాఖ (ఎంహెచ్ఆర్డి) లెక్కల ప్రకారం ఈ సంస్థ ఇంజనీరింగ్ విభాగంలో 139వ స్థానంలో ఉంది. 2017లో ర్యాంక్ బ్యాండ్ 151-200 నుంచి (ఐఏఆర్ఈ) భారతదేశంలో 139వ ఉత్తమ ఇంజనీరింగ్ సంస్థగా గుర్తించబడింది. దేశంలోని 300ల బెస్ట్ కాలేజీలో ఎన్ఐఆర్ఎఫ్-2020 ర్యాంకింగ్ సాధించింది. ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ (ఐఏఆఈ)లో 170 స్థానం లభిచింది. అత్యుత్తమ బోధన, పరిశోధన, ఉపాధి, ఆవిష్కరణ రంగాల్లో నాణ్యతా ప్రమాణాలను పాటించడంతో ఉన్నత స్థాయికి చేరింది.
ర్యాంక్‌ల పంట...
తెలంగాణ రాష్ట్రంలో ఈ సంస్థ వివిధ స్వతంత్ర జాతీయ ఏజెన్సీలచే ర్యాంక్ సాధించింది. ఇందులో కెరీర్స్ 360ఏఏఏ+, భారతదేశంలోని టాప్200 ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలలో 50వ ర్యాంక్, ఇండియాటుడే శతాబ్దపు టాప్25 అభివద్ధి చెందుతున్న ప్రయివేటు కాలేజీలలో 17వ ర్యాంక్‌ను ఈ సంస్థ సాధించింది. ప్రయివేటు ఇంజనీరింగ్ కళాశాలల్లో 55వ ర్యాంక్‌ను, దక్షిణ భారతదేశంలో 45వ ర్యాంక్ సాధించి భారతదేశంలోని టాప్140 ఇంజనీరింగ్ కాలేజీలలో 75వ ర్యాంక్, టైమ్స్ ఆఫ్ ఇండియా నిర్వహించిన సర్వేలో భారతదేశంలోని టాప్100 ప్రయివేటు ఇంజనీరింగ్ కాలేజీలలో 62వ ర్యాంక్, టాప్29 ఇంజనీరింగ్ కాలేజీలలో 23వ ర్యాంక్, కాంపిటీషన్ సక్సెస్ రివ్యూ ద్వారా ఎమినెన్స్ ఇండియా, అవుట్‌లుక్ చేత భారతదేశంలోని టాప్ 150 ఇంజనీరింగ్ సంస్థలలో 127వ ర్యాంక్, టాప్ 100 ప్రభుత్వ, ప్రయివేటు టి-స్కూళ్ళలో 69వ ర్యాంక్, డేటాక్వెస్ట్ చేత భారతదేశంలోని టాప్ ప్రయివేటు టి-స్కూళ్ళలో 49వ ర్యాంక్, ఆల్ ఇండియా ర్యాంక్ బ్యాండ్ 51 ప్రైవేట్ సంస్థలలో బిజినెస్ వరల్డ్ చేత 65 మరియు 32వ ర్యాంక్‌లను సాధించి ఉత్తమ విద్యార్థులకు చక్కటి భవిష్యత్తును అందించింది.
శక్తి సామర్ధ్యాల పెంపు
దేశవిదేశాల్లో పరిస్థితులకు అనుగుణంగా తట్టుకుని నిలబడే శక్తి సామర్ధ్యాలను ఇక్కడ విద్యార్థులకు అందించడం జరుగుతుంది. ముఖ్యంగా నాణ్యతకలిగిన ఇంజనీర్లను తీర్చిదిద్దుతున్నారు. భవిష్యత్తులో ఉన్నత స్థాయిలో నిలిచేందుకు బాటలు వేస్తున్నారు.
నాణ్యతా ప్రమాణం
ఉన్నత చదువులతో చక్కటి విలువలు కలిగిన ఫ్యాకల్టీతో విద్యార్థులకు చదువులను అందించడం ద్వారా ఇక్కడ చదువుకున్న విద్యార్థులు చక్కటి అవకాశాలను చేజిక్కించుకుంటున్నారు. విద్యార్థుల అభిరుచులకు అనుగుణంగా వారిని ప్రోత్సహిస్తున్నారు. ఎరోనాటికల్ ఇంజనీరింగ్‌తో పాటు సైన్స్ విభాగానికి చెందిన అన్ని రంగాలుడడంతో ఎరోనాటికల్ ఇంజనీరింగ్ రంగంలో ఉజ్వల భవిష్యత్తును అందిస్తోంది. ఉత్తమఫలితాలు సాధిస్తోంది. ఇక్కడ విజ్ఞానవంతులైన విద్యార్థులను తయారు చేయటంలో ప్రపంచవ్యాప్తంగా గొప్ప ఖ్యాతి గడించింది. విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తూనే విద్యార్థుల అభిరుచులకు అనుగూనంగా వారిని ప్రోత్సహిస్తూ వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తోంది.