Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
మధ్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం వల్ల మంగళవారం మరో అల్పపీడనం ఏర్పడింది. వచ్చే రెండు రోజులు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశముందనీ, పలు చోట్ల భారీ వర్షాలు పడొచ్చని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారి నాగరత్నం తెలిపారు. వనపర్తి జిల్లా ఘన్పూర్లో అత్యధికంగా 6.3 సెంటీమీటర్లు, యాదాద్రి భువనగిరి జిల్లా గుండాలలో 5.5, రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఆరుట్లలో 5.5 సెంటీమీటర్లు, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కీసర మండలం దమ్మాయిగూడలో 5.0 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.