Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం కాళేశ్వరం పర్యటనకు వెళ్లనున్నారు. ఇందులో భాగంగా ఉదయం 10 గంటలకు హైదరాబాద్ నుంచి ఆయన హెలికాఫ్టర్లో బయల్దేరి మేడిగడ్డ బ్యారేజీ వద్దకు చేరుకుంటారు. అక్కడ నీటి మట్టం వంద అడుగులకు చేరిన నేపథ్యంలో సీఎం అధికారులతో కలిసి బ్యారేజీ పరిసర ప్రాంతాలను సందర్శిస్తారు. అక్కడే మధ్యాహ్న భోజనం చేస్తారు. సాయంత్రం తిరిగి హైదరాబాద్కు చేరుకుంటారని సీఎంవో వర్గాలు తెలిపాయి.