Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : నిట్ యూనివర్శిటీ (ఎన్యు)ను తిరిగి తెరవడానికి విద్యార్థుల తల్లిదండ్రులు తమ సంపూర్ణ మద్దతును తెలిపారని ఆ సంస్థ వెల్లడించింది. తమ రెసిడెన్షియల్ ఇనిస్టిట్యూషన్ పునః ప్రారంభానికి తీసుకోవాల్సిన చర్యలు, తల్లిదండ్రుల అభిప్రాయాలను సేకరించినట్లు తెలిపింది. తమ విద్యా సంస్థ అత్యున్నత భద్రతను అందిస్తుందని 83.5 శాతం పేర్కొన్నట్లు వెల్లడించింది. కాగా వేలి ముద్రల ద్వారా ప్రవేశాలకు బదులుగా యాక్సెస్ కార్డులను వినియోగించాలని 89.1 శాతం మంది అభిప్రాయ పడ్డారని పేర్కొంది. ఫ్యాకల్టీ, సిబ్బందిని సైతం క్యాంపస్ నుంచి బయటకు వెళ్లడాన్ని నిరోధించాలని వారు భావించారు. క్రీడా కార్యక్రమాలను సైతం ఆరంభించాలని సూచనలు వచ్చాయని తెలిపింది.