- రాజకీయ పార్టీల డిమాండ్ నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్ రైతుల నుంచి బలవంతపు భూసేకరణను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆపాలని రాజకీయ పార్టీలు డిమాండ్ చేశాయి. సీపీఐ, సీపీఐ(ఎం), కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ, ఎంసీపీఐ(యూ), సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ, సీపీఐ(ఎంఎల్) తదితర రాజకీయ పార్టీల రాష్ట్ర నాయకుల సమావేశం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞానకేంద్రంలో జరిగింది. ఆ సమావేశంలో చేసిన తీర్మానాన్ని తమ్మినేని వీరభద్రం (సీపీఐఎం), చాడవెంకట్‌రెడ్డి (సీపీఐ), ఎం కోదండరెడ్డి (కాంగ్రెస్), ఎల్ రమణ (టీడీపీ), కోదండరాం (టీజేఎస్), డివి కృష్ణ (సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ), గాదగోని రవి (ఎంసీపీఐయూ), సాధినేని వెంకటేశ్వరరావు (సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ), ప్రసాద్ (సీపీఐఎంఎల్) సోమవారం ఒక ప్రకటనలో ప్రకటించారు. సంగారెడ్డి జిల్లా న్యాల్కల్, ఝరాసంగం మండలాల పరిధిలోని 17 గ్రామాలు, 5 తండాల నుంచి 12,635 ఎకరాల భూమిని సేకరించి నిమ్జ్ (జాతీయ పెట్టుబడి, తయారీ రంగ సముదాయం)ను నెలకొల్పాలనే ప్రతిపాదనతో ప్రభుత్వం ముందుకెళ్తున్నదని విమర్శించారు. అన్ని రకాల చట్టాలనూ, సహజ న్యాయ సూత్రాలనూ, రాజ్యాంగాన్నీ తుంగలో తొక్కుతున్నదని తెలిపారు. మరోవైపు ఫార్మాసిటీ పేరుతో రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం, మహేశ్వరం నియోజకవర్గాల పరిధిలో 19,333 ఎకరాల భూమిని రైతుల నుంచి గుంజుకుంటున్నదని పేర్కొన్నారు. తాము సేకరిస్తున్న దాంట్లో అత్యధిక భాగం బీడు భూములేనని ప్రభుత్వం బుకాయిస్తున్నదని వివరించారు. వాస్తవమేమంటే, ఇందులో వెయ్యి ఎకరాలు తప్ప మిగతా మొత్తం సాగుభూమి అని ఏటా రెండు పంటలు పండుతాయని తెలిపారు. జామ తోటలకూ ఈ ప్రాంతం ప్రసిద్ధి అని వివరించారు. ఈ భూముల వల్ల ఎంతో మంది ప్రత్యక్ష, పరోక్ష ఉపాధిని పొందుతున్నారని నెలకొల్పాలనే ప్రతిపాదనతో ప్రభుత్వం ముందుకెళ్తున్నదని విమర్శించారు. అన్ని రకాల చట్టాలనూ, సహజ న్యాయ సూత్రాలనూ, రాజ్యాంగాన్నీ తుంగలో తొక్కుతున్నదని తెలిపారు. మరోవైపు ఫార్మాసిటీ పేరుతో రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం, మహేశ్వరం నియోజకవర్గాల పరిధిలో 19,333 ఎకరాల భూమిని రైతుల నుంచి గుంజుకుంటున్నదని పేర్కొన్నారు. తాము సేకరిస్తున్న దాంట్లో అత్యధిక భాగం బీడు భూములేనని ప్రభుత్వం బుకాయిస్తున్నదని వివరించారు. వాస్తవమేమంటే, ఇందులో వెయ్యి ఎకరాలు తప్ప మిగతా మొత్తం సాగుభూమి అని ఏటా రెండు పంటలు పండుతాయని తెలిపారు. జామ తోటలకూ ఈ ప్రాంతం ప్రసిద్ధి అని వివరించారు. ఈ భూముల వల్ల ఎంతో మంది ప్రత్యక్ష, పరోక్ష ఉపాధిని పొందుతున్నారని పేర్కొన్నారు. ఇలాంటి భూములను ప్రభుత్వం రైతుల నుంచి బలవంతంగా తీసుకోవడాన్ని తీవ్రంగా ఖండించారు. సంగారెడ్డి జిల్లాలో కేవలం ఒకరోజు ముందు డప్పు చాటింపు వేసేదాకా ప్రజలకు ఈ విషయం తెలియదని తెలిపారు. పర్యావరణ నివేదిక తెలుగులో ఇవ్వలేదని పేర్కొన్నారు. పోలీస్ పికెట్ పెట్టి ప్రజలను ప్రజాభిప్రాయ సేకరణకు రాకుండా గ్రామాల్లో నిర్బంధించారని విమర్శించారు. అయినా వెరవక ముందుకు కదిలినవారిపై లాఠీచార్జీ చేశారని పేర్కొన్నారు. మహిళలనీ చూడకుండా దౌర్జన్యం చేశారని తెలిపారు. హాజరైనవారిలో ఎక్కువమంది భూసేకరణను వ్యతిరేకించారని వివరించారు. ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ గ్రామాలు, తండాల నుంచి 30 తీర్మానాలు వచ్చినా అధికారులు పట్టించుకోలేదని తెలిపారు. అప్రజాస్వామికంగా, ప్రజలను అణచివేసి, అక్కడకు రాకుండా అడ్డుకుని బహిరంగ విచారణను తూతూమంత్రంగా జరిపారని విమర్శించారు. ఇప్పటికే సేకరించిన 12,635 ఎకరాల భూమిలో పరిశ్రమలకు వాడింది కేవలం 6,434 ఎకరాలు మాత్రమేనని పేర్కొన్నారు. మిగతా భూమి హరితహారం, గహవసతి వంటి వాటికి వాడుతామని ప్రభుత్వం చెప్పడం సిగ్గుచేటని తెలిపారు. ఏటా మూడు పంటలు పండే పచ్చని భూములను కాజేసి హరితహారం అనడం హాస్యాస్పదం, అమానవీయమని పేర్కొన్నారు. దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం 2013 భూసేకరణ చట్టాన్ని పక్కనపెట్టి, కోర్టు తీర్పులకు విరుద్ధంగా, జీవోల ద్వారా బలవంతంగా రైతుల నుంచి భూమి గుంజుకుంటున్నదని విమర్శించారు. రైతులు అభ్యంతరం తెలిపినప్పుడు అరెస్టులు చేసి నిర్బంధాన్ని ప్రయోగిస్తూ భయభ్రాంతులకు గురిచేస్తున్నదని తెలిపారు. ఇప్పటికైనా ఈ బలవంతపు భూసేకరణ, అక్రమ అరెస్టులను ఆపాలని డిమాండ్ చేశారు.