Mon January 19, 2015 06:51:29 pm
  • Telangana
  • Nattional
  • E Paper
  • BreakingNews
  • Top Stories
  • Manavi

logo

MENU
  • హోం
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • సాహిత్యం
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • రక్ష
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • రేపు పీజీఈసెట్‌ నోటిఫికేషన్‌..
  • తిరుమలలో భక్తుల రద్దీ
  • చివరిదశలో పేలిపోయిన ‘స్టార్‌షిప్’ రాకెట్..
  • ప్రకాశం జిల్లాలో లారీని ఢీకొన్న ట్రావెల్స్ బస్సు
  • మూడు కాళ్లతో వింత శిశువు జననం
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
రాబడులకు భిన్నంగా పద్దులు.. | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి

రాబడులకు భిన్నంగా పద్దులు..

Tue 26 Jan 03:57:49.776623 2021

- ఆదాయ అంచనాలు.. వాస్తవాల్లో 20 నుంచి 30 శాతం తేడా
- అయినా బడ్జెట్‌ను పెంచుతూ పోతున్న సర్కార్‌
- 2014 నుంచి ఇదే వైనం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్‌
తెలంగాణ నూతన రాష్ట్రంగా ఆవిర్భవించిన కొత్తలో 2014-15 ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్‌ అక్షరాలా రూ.లక్షా 637 కోట్లు. ఐదేండ్లు గడిచిన తర్వాత ప్రస్తుత ఆర్థిక సంవత్సరాని (2020-21)కి సమర్పించిన పద్దు రూ.లక్షా 82 వేల కోట్లు. అంటే ఐదేండ్ల కాలంలో మన బడ్జెట్‌ రూ.81 వేల కోట్ల మేర పెరిగిందన్నమాట. ఈ రకంగా టీఆర్‌ఎస్‌ సర్కారు ఏడాదికేడాది అంచనాలను భారీగా పెంచుకుంటూ పోతున్నప్పటికీ వాస్తవంలో మాత్రం వాటిని చేరుకోలేకపోతున్నది. ఈ క్రమంలో బడ్జెట్‌లో రెవెన్యూ ఆదాయానికి సంబంధించి ప్రభుత్వం వేసుకుంటున్న అంచనాలు, వాస్తవంగా వచ్చిన రాబడికి మధ్య 20 శాతం 30 శాతం వరకూ వ్యత్యాసం ఉంటున్నది. ఒకట్రెండు సందర్భాల్లో తప్ప మిగతా అన్ని సంవత్సరాల్లోనూ ఇదే పరిస్థితి కొనసాగుతున్నది. 2014 నుంచి ఇప్పటి వరకూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ల తీరు తెన్నులను పరిశీలిస్తే ఇదే విషయం తేటతెల్లమవుతున్నది. అధికారిక లెక్కలే ఈ వాస్తవాలను విశదీకరిస్తుండటం గమనార్హం.
రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి నేటి వరకూ బడ్జెట్‌ అంచనాలు భారీగా పెరుగుతూ పోతున్నాయి. అయితే పద్దులను ప్రవేశ పెట్టే సమయంలో వాస్తవాల ఆధారంగానే బడ్జెట్‌ను రూపొందిస్తున్నామంటూ ముఖ్యమంత్రి కేసీఆర్‌తోపాటు ఆర్థిక మంత్రులు చెబుతూ వస్తున్నారు. కానీ మరుసటి ఏడాది బడ్జెట్‌ను, ఆ సందర్భంగా గతేడాది ఎంత రెవెన్యూ ఆదాయం వచ్చిందనే విషయాన్ని పరిశీలిస్తే మాత్రం వారి మాటలు వాస్తవానికి దూరంగా ఉన్నాయనే విషయం ఇట్టే తెలిసిపోతున్నది. ఇలా వాస్తవ ఆదాయాలు, రాబడులకు విరుద్ధంగా పద్దును పెంచి చూపటం... తద్వారా ప్రజల్లో భ్రమలు కల్పించటం సరికాదంటూ ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవటం లేదు. వారి సలహాలు, సూచనలను ఖాతరు చేయకుండా అంచనాలను అమాంతం పెంచుతూ పోతున్నారు. అయితే వీటికి అనుగుణంగా రెవెన్యూ రాబడులు లేకపోవటంతో కేటాయింపులను ఆ తర్వాత భారీగా కుదిస్తున్నారు. పరిస్థితి ఈ విధంగా ఉండగా మనది మిగులు రాష్ట్రం, ధనిక రాష్ట్రమంటూ అదే ప్రభుత్వ పెద్దలు గొప్పలు చెబుతుండటం గమనార్హం. రెండంకెల వృద్ధి అంటూ వారు ప్రకటనల మీద ప్రకటనలు గుప్పించటం ఆనవాయితీగా మారింది. ఈ తీరు మారాలనీ... లేదంటే రాష్ట్రానికి మున్ముందు తీరని నష్టం వాటిల్లుతుందని ఆర్థిక విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.
ఇంకో ఏడాది పట్టొచ్చు : డాక్టర్‌ అందె సత్యం - ఆర్థిక విశ్లేషకులు
'కరోనా లాంటి ఏదైనా అనుకోని విపత్తు రాకపోతే సాధారణ పరిస్థితుల్లో బడ్జెట్‌ పరిమాణం... ప్రతీ ఏడాది 10 శాతం పెరుగుతూ పోతుంది. కానీ కోవిడ్‌ నేపథ్యంలో గతేడాదితో పోల్చితే మాత్రం ఆదాయం సుమారు రూ.40 వేల కోట్లు తగ్గనుంది. ఫలితంగా బడ్జెట్‌ వాస్తవ రూపం తక్కువగా ఉండే అవకాశముంది. ప్రస్తుత బడ్జెట్‌లో చెప్పినట్టుగా రూ.1.82 లక్షల కోట్ల పద్దు నిజం కావాలన్నా, అంత ఆదాయం రావాలన్నా ఇంకో ఏడాది పట్టొచ్చు. కాబట్టి శాఖల కేటాయింపులు కూడా కచ్చితంగా రూ.40 వేల కోట్ల వరకూ తగ్గే అవకాశముంది. కోవిడ్‌తోపాటు ఇతరత్రా కారణాల వల్ల సర్కారు ఆదాయం పడిపోయింది. అందువల్ల ప్రస్తుతం రూ.1.82 లక్షల కోట్లతో ఉన్న బడ్జెట్‌ వాస్తవ రూపంలో రూ.1.50 లక్షల కోట్లకే పరిమితం కావొచ్చు...'

 

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

యాదాద్రి.. దేశంలోని ఆలయాలకు ఆదర్శం
మంత్రాలతో బంగారమంటూ మోసం
54శాతం మందిలో కొవిడ్‌ యాంటీబాడీలు
వాళ్లదే హవా!
ప్రశ్నించే గొంతుకలకే ఓటేద్దాం
సమస్యల పరిష్కారానికి 9న సీఎంకు సంతకాలతో కూడిన వినతి
నిప్పంటుకొని తల్లీకూతురు మృతి
ముగిసిన జనజాతర
విధుల నుంచి తొలగించారని....ట్యాంక్‌ ఎక్కిన కార్మికుడు
టీఆర్‌ఎస్‌ ఎంపీటీసీపై హత్యాయత్నం
గొత్తికోయ పేదలను ఆదుకోవాలి
కరోనా మరణాల్లో ఊబకాయులే ఎక్కువ
సైబర్‌ వాలంటీయర్స్‌ పై ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలి
కుక్కల దాడిలో 25 గొర్రెలు మృత్యువాత
పీసీ లేకనే క్రిమినల్‌ కేసుల జాప్యం
ఐఏసీటీఎస్‌కు ఎంపికైన స్టార్‌ హాస్పిటల్స్‌ డాక్టర్‌ లోకేశ్వరరావు
అరుదైన బ్రెయిన్‌ ట్యూమర్‌ను గుర్తించిన ఒలివ్‌ హాస్పిటల్స్‌ రేడియాలజిస్ట్‌
బీజేపీ... టీఆర్‌ఎస్‌ గ్రాఫ్‌ పడిపోతున్నది : రేవంత్‌ రెడ్డి
అన్నింటిలో అధ్వానం
తెలంగాణకు అన్యాయం చేయటం బీజేపీకి అలవాటే.. :కేటీఆర్‌
రిజిస్ట్రేషన్‌, స్టాంపుల శాఖ పనితీరు భేష్‌ : సీఎస్‌
ప్రధానితో మాట్లాడి ఐటీఐఆర్‌ను మంజూరు చేయించాలి
బడుల్లోనూ ఇంటర్‌ పరీక్షలు
రేపు పీజీఈసెట్‌ నోటిఫికేషన్‌
రాజాసింగ్‌ ఎమ్మెల్యేగా అనర్హుడు
అసెంబ్లీ ఆమోదం లేకుండానే..
గవర్నర్‌ తమిళిసైకి
నేటి నుంచి జిల్లా, ఏరియా, సీహెచ్‌సీ ఆస్పత్రుల్లో ...
29 రోడ్లకు అటవీ అనుమతులు, పురోగతిపై చర్చ
అక్రమ నిర్మాణాలను అడ్డుకునే చర్యలేవి?
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required
  • Home
  • Breaking News
  • ossLib
© Copyright Navatelangana.com 2015. All rights reserved.