6,7 తేదీల్లో స్టాఫ్ నర్సుల వెబ్‌ఆప్షన్లలో మార్పులు : టీఎస్‌పీఎస్సీ
Wed 03 Mar 02:25:09.286653 2021
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్ ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖలో ప్రకటించిన స్టాఫ్ నర్సు పోస్టులకు ధ్రువపత్రాల పరిశీలనకు హాజరైన అభ్యర్థులు వెబ్‌ఆప్షన్లలో మార్పులు చేసేందుకు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) అనుమతి ఇచ్చింది. ఈ మేరకు టీఎస్‌పీఎస్సీ ముఖ్యకార్యదర్శి ఎ వాణీప్రసాద్ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈనెల 6,7 తేదీల్లో ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. వెబ్‌ఆప్షన్లు ఇచ్చినపుడు తప్పులు దొర్లాయని కొందరు అభ్యర్థులు తమకు విజ్ఞప్తి చేశారని గుర్తు చేశారు. అయితే డిపార్ట్‌మెంట్, జోనల్‌కు సంబంధించిన వాటినే మార్పులు చేసేందుకు అవకాశమిచ్చామని తెలిపారు.