Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గండిపేట్
యువతిపై ప్రేమోన్మాది కత్తితో దాడి చేశాడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా గండిపేట్లోని హైదర్షాకోట్ పరిధిలో మంగళవారం రాత్రి జరిగింది. స్థానికంగా ఉంటూ సాప్ట్వేర్ ఉద్యోగం చేస్తున్న యువతి (27) ఇంటికి వెళ్లి అతి కిరాతకంగా కత్తితో దాడి చేశాడు. అనంతరం పారిపోతుండగా స్థానికులు గుర్తించి దేహశుద్ధి చేసి, నార్సింగ్ పోలీసులకు అప్పగించారు. ప్రేమోన్మాది చేతిలో గాయపడిన యువతిని గంగరాజు ప్రయివేటు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉంది. కాగా, గతంలో ఆమె స్నేహితుడైన నిందితుడు ప్రేమ పేరుతో వేధిస్తుండటంతో యువతి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు.