Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ తెలంగాణకు చెందిన ఒక గ్రామైక్య సంఘం(వీఓ), రెండు స్వయం సహాయక సంఘాల(ఎస్‌హెచ్‌జీ)కు అవార్డులను శనివారం ప్రకటించింది. ఉత్తమ ప్రదర్శన కేటగిరీలో దేశవ్యాప్తంగా 30 ఎస్‌హెచ్‌జీలు, 10 గ్రామైక్య సంఘాలకు ఈ అవార్డులు దక్కాయి. వీఓ కేటగిరీలో మన రాష్ట్రంలోని సిద్ధిపేట జిల్లా నంగనూరు మండలంలోని ముద్రయి గ్రామైక్య సంఘం(వీఓ), ఎస్‌హెచ్‌జీ కేటగిరీలో కామారెడ్డి జిల్లా ఉగ్రవాయి గ్రామానికి చెందిన బాలాజీ మహిళా పొదుపు సంఘం, రంగారెడ్డి జిల్లాలోని చిలుకూరుకు చెందిన ప్రగతి పొదుపు సంఘం ఎంపికయ్యాయి. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 8న జరిగే వర్చువల్ సభలో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ఈ అవార్డులను అందజేయనున్నారు.