Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బాబా ...అంబేద్కరా
నీవేమీ విగ్రహమాత్రుడివి కావు
నిరంతర జ్ఞాన చలనశీలివి
మీరు నమ్మకండి బాబా
మీ మెళ్ళోవేసే దండలన్ని ప్రేమతోనేనని
మీపై కురిపించే ప్రశంసలన్నీ అభిమానంతోనేనని
మీ పేర చేసే వాగ్దానాలన్నీ
మీ ఆలోచనలపై గౌరవంతోనేనని
ఆ కుసుమాలలన్నీ
కుట్ర కంపు కొడుతున్నాయి
ఆ ప్రశంసల నేతల నోళ్లన్నీ
మురుగు కాలువలను తలపిస్తాయి
మీ పేర చేసే వాగ్దానాలన్నీ
అమావాస్య వెన్నెలలవుతాయి
మీరేసిన ఎరువుల సారంతో
ఏపుగా ఎదుగుతున్న మేథో పంటలను
నిర్బంధం కత్తులతో కోసేస్తూన్నారయ్యా!
బాబా.. అంబేద్కరా
నీ శ్రమ ఫలితం పొందిన మాలో కొందరు
ముసుగులుతన్ని
హాయిగా నిదురిస్తున్నారు
నీవిచ్చిన జ్ఞాన ఖడ్ఘాలు పొందినవారు
వారి స్వార్థపు ఒరల్లో
పదిలంగా దాచుకుంటున్నారు.
బాబా.. అంబేద్కరా...
నిజమైన నీ వారసులం
ఇంకా బరిలోనే నిలిచి ఉన్నాం
నీవిచ్చిన జ్ఞాన జ్యోతులు చేతబూని
అసమానతల చీకట్లను పారదోలుతాం
నీవిచ్చిన జ్ఞాన ఖడ్ఘాలు ధరించి
అంతరాల దొంతరలను ఖండిస్తాం
నువు పంచిన విలువల వెలుగులను
ప్రపంచం ముందు పరుస్తాం..
- వి.దిలీప్
సెల్ : 8464030808