Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, సబ్బండ వర్గాల ఆత్మగౌరవానికి, మహిళాచైతన్యానికి ప్రతీకగా నిలిచిన, చిట్యాల (చాకలి) ఐలమ్మ 126వ జయంతి (సెప్టెంబర్ 26) సందర్భంగా సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. ఐలమ్మ ప్రజాస్వామిక పోరాట స్పూర్తి అని ఆయన శనివారం ఒక ప్రకటనలో వివరించారు. అత్యంత వెనకబడిన కులం (ఎంబీసీ)లో జన్మించిన ఆమె తెలంగాణ బహుజన వర్గాల స్ఫూర్తి ప్రదాతగా నిలిచారని పేర్కొన్నారు. సాయుధ పోరాట కాలంలోనే హక్కుల సాధన కోసం, చట్టం పరిధిలో, కోర్టుల్లో న్యాయం కోసం కొట్లాడిన గొప్ప ప్రజాస్వామికవాది ఐలమ్మ అని ఆమె సేవల గురించి వివరించారు. రాష్ట్ర సాధనలో ఐలమ్మ ప్రజాస్వామిక పోరాట స్ఫూర్తి ఇమిడి ఉందని తెలిపారు. ఆమె జయంతి, వర్థంతి కార్యక్రమాలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుందన్నారు.