Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డీజీపీని కోరిన షర్మిల
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి : రాష్ట్రంలో తాను నిర్వహిస్తున్న పాదయాత్ర సందర్భంగా తనకు రక్షణ కల్పించాలని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల.. డీజీపీని కోరారు. దీనికి సంబంధించి ఒక వినతి పత్రాన్ని ఆమె శుక్రవారం డీజీపీ కార్యాలయానికి వచ్చి సమర్పించారు. ఆ సమయంలో డీజీపీ లేకపోవటంతో అదనపు డీజీ జితేందర్‌కు ఆమె వినతి పత్రాన్ని ఇచ్చారు. తనకు టీఆర్ఎస్ శ్రేణుల నుంచి ముప్పు పొంచి ఉన్నదని ఆమె అందులో పేర్కొన్నారు.