Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అందుకే తెలంగాణలో కుట్రలు: శాసనమండలి చైర్మెన్ గుత్తా సుఖేందర్ రెడ్డి
నవతెలంగాణ -నల్లగొండ
వారికి ఆంధ్రాలో ముఖం చెల్లక తెలంగాణలో దండులా విరుచుకుపడుతున్నారని శాసనమండలి చైర్మెన్ గుత్తా సుఖేందర్ రెడ్డి వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు షర్మిలపై పరోక్షంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. శక్రవారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని తన క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అన్ని రంగాల్లో తెలంగాణ రాష్ట్రం దూసుకుపోతున్నదని తెలిపారు. తెలంగాణ రాక ముందు సమైక్యవాదులు ఇక్కడి వనరులను దోచుకున్న విధంగా, మళ్లీ ఇప్పుడు సమైక్య వాదులు కుట్రలు మొదలు పెట్టారని విమర్శించారు. షర్మిల, బండి, సంజయ్, గవర్నర్ వ్యవహారం, ఈడీ, సీబీఐలు ఇలా అన్నీ చూస్తుంటే ముఖ్యమంత్రి కుటుంబంపై దాడి చేస్తున్న ట్టుగా ఉందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో ప్రజలు సబ్బండ వర్గాలు సంతోషంగా ఉన్నారని తెలిపారు. రాష్ట్రం అన్ని రంగాల్లోనూ పురోగతి కనబడుతుందని.. అందుకే సమైక్య వాదులు కన్ను పడిందన్నారు. మళ్లీ దోచుకుందామని తెలంగాణలో రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. మోడీ కూడా బరి తెగిస్తూ తెలంగాణపై అడుగడుగునా విషం చిమ్ముతున్నారన్నారు. ఇప్పటికీ దేశంలో 8 రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్రం కూలదొసిందని తెలిపారు. ఇప్పుడు తెలంగాణపై పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. స్వీయ రాజకీయ అస్తిత్వమే మనకు శ్రీరామరక్ష అని, దత్త పుత్రిక పాదయాత్ర చేస్తూ అడ్డగోలుగా ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ సమాజం అప్రమత్తంగా ఉండాలని కోరారు.