Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పలువురు విద్యార్థులకు గాయాలు
నవతెలంగాణ - అశ్వారావుపేట
విహార యాత్రకు వెళుతున్న విద్యార్థుల బస్సు బోల్తా పడిన ఘటనలో పలువురు గాయాల పాలయ్యారు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో శనివారం ఉదయం జరిగింది. ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చెందిన గీతం కళాశాల విద్యార్థులు ఆంధ్రప్రదేశ్‌లోని కడియం విహార యాత్రకు అశ్వారావుపేట మీదుగా ఓ ప్రయివేటు ట్రావెలర్స్ బస్సులో శనివారం ఉదయం బయలుదేరారు. కాగా, అశ్వారావుపేట మండలం పాపిడిగూడెం సమీపంలో బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాద సమయంలో మొత్తం సిబ్బందితో 45 మంది బస్సులో ఉన్నారు. సుమారు 15 మంది విద్యార్ధ్థులకు స్వల్ప గాయాలయ్యాయి. విద్యార్థులను వెంటనే స్థానిక పీహెచ్‌సీకి తరలించారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఆస్పత్రికి చేరుకొని తమ పిల్లలను తీసుకెళ్లారు. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ సాయి కిషోర్ రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీశారు. అందరూ క్షేమంగా బయటపడటంతో ఊపిరి పీల్చుకున్నారు. యాజమాన్యం నుంచి ఫిర్యాదు అందలేదని ఎస్‌ఐ తెలిపారు.