Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేఆర్ఎంబీకి రజత్‌కుమార్ లేఖ
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
కేఆర్ఎంబీ, ఆర్ఎంసీ భేటి సోమవారం హైదరాబాద్‌లోని జలసౌధలో జరిగింది. ఈ సమావేశానికి తెలంగాణ సభ్యులు హాజరుకాలేదు. ఎపీ అధికారులు వచ్చారు. జలవిద్యుత్ ఉత్పత్తి, వరద జలాల వినియోగంపై చర్చ, రూల్ కర్వ్ కోసం సిఫారసులతో కూడిన మూసాయిదా నివేదికపై చర్చించేందుకు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు(కేఆర్ఎంబీ), రిజర్వాయర్ మేనేజ్మెంట్ కమిటీ(ఆర్ఎంసీ) భేటి చోటుచేసుకుంది. కన్వీనర్ రవికుమార్ పిళ్లై నేతృత్వంలో నిర్వహించిన ఈ భేటికి ఏపీ నుంచి ఇంజినీర్ ఇన్ చీఫ్ నారాయణరెడ్డి హాజరయ్యారు. నివేదికపై ఏపీ సభ్యుల సంతకాలు తీసుకున్న ఆర్ఎంసీ, కేఆర్ఎంబీకి నివేదిక సమర్పించనుంది. మరోవైపు ఆర్ఎంసీ ముసాయిదా రాష్ట్ర ప్రయోజనాలకు విరుద్ధంగా ఉందంటూ కేఆర్ఎంబీ చైర్మెన్‌కు తెలంగాణ నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్ లేఖ రాశారు. ఆర్ఎంసీ నివేదికలోని అంశాలు, తమకు ఆమోదయోగ్యం కాదని అందులో పేర్కొన్నారు. ఈ నివేదికను నిలిపేయాలనీ, మీడియాకు సరైన వివరణ ఇవ్వాలని కోరారు.