Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్రం ఆంక్షలతో రాష్ట్రానికి రూ.40 వేల కోట్ల నష్టం :లోక్సభ టీఆర్ఎస్ పక్షనేత నామ డిమాండ్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన అంశాలపై పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో సమగ్ర చర్చించి రాష్ట్రానికి న్యాయం చేయాలని లోక్సభ టీఆర్ఎస్ పక్ష నేత నామ నాగేశ్వరరావు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం నుంచి జరగనున్న శీతాకాల సమావేశాలను పురస్కరించుకుని మంగళవారం న్యూఢిల్లీలో స్పీకర్ ఓం ప్రకాశ్ బిర్లా నిర్వ హించిన అఖిలపక్ష సమావేశంలో నామ మాట్లాడారు. రాష్ట్రానికి సంబం ధించి ఎంతో కాలంగా కేంద్రం వద్ద పెండింగ్లో ఉన్న అన్ని విభజన అం శాలను త్వరితగతిన పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కోరా రు. విభజన చట్టంలో ఇచ్చిన హామీల్లో ఇంతవరకు ఏ ఒక్కటీ కూడా అమ లు చేయలేదని ఆవేదన వ్యక్తంచేశారు. రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బ తీసేలా కేంద్రం వ్యవ హరిస్తున్నదని విమర్శించారు. కేంద్రం ఉద్దేశపూర్వ కంగా తెలంగాణ ఆర్థిక మూలాలు దెబ్బతీస్తున్నదని చెప్పారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏ ఒక్క విభజన హామీ అమలు చేయలేదని విమర్శిం చారు. తెలం గాణ రాష్ట్రం ఎందుకీ వివక్ష చూపుతున్నారని ప్రశ్నించారు. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు కర్మాగారం, గిరిజన యూనివర్శి టీ, ఐఐఎం స్థాపన తదితర హామీలు ఏమయ్యాయని నిలదీశారు. వీటన్నిం టిపై పార్ల మెంటు సమావేశాల్లోనే చర్చించి, తెలంగాణకు న్యాయం చేయాలని కోరారు.