Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హైకోర్టులో సీనియర్ న్యాయవాది దవే వాదన
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఎమ్మెల్యే ఎర కేసులో నిందితులను సీఆర్పీసీలోని 41ఎ సెక్షన్ ప్రకారం అరెస్టు చేయవచ్చుననీ, సిట్‌ను సవాల్ చేసిన కేసులను విచారణ చేసే పరిధి కోర్టులకు లేదని సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే వాదించారు. నిహారిక కేసులో ఈ విషయాన్ని సుప్రీంకోర్టు ఇదే విషయాన్ని తేల్చి చెప్పిందని ఆయన గుర్తుచేశారు. పోలీసులు దర్యాప్తు చేసి చార్జిషీటు వేశాకే మేజిస్ట్రేట్ కోర్టుకు తేల్చే అధికారం ఉంటుందన్నారు. సిట్ విచారణ దశలోనే అడ్డుకోవడం అన్యాయమనీ, ఎమ్మెల్యేల కొనుగోలుకు ప్రయత్నించిన వారు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని చెప్పారు. పోలీసులు వల పన్ని నిందితులను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారని గుర్తు చేశారు. ఈ కేసు విచారణ కొనసాగాలనీ, సీబీఐ దర్యాప్తు అవసరం లేదన్నారు. సిట్ వద్ద అనేక ఆధారాలు ఉన్నాయంటూ సిట్, రాష్ట్ర ప్రభుత్వం తరఫున దుష్యంత్ దవే వాదించారు. సిట్ కేసును కొట్టేయాలంటూ దాఖలైన పలు కేసులను మంగళవారం జస్టిస్ బి.విజరుసేన్‌రెడ్డి విచారించారు. దవే వాదనలు కొనసాగిస్తూ. సిట్ దర్యాప్తును అడ్డుకోవడం మొదలు పెడితే రోజుకో కేసు వేస్తారనీ, కేసుకు సంబంధం లేదంటూనే బీజేపీ కేసులు వేస్తోందని గుర్తుచేశారు. రోజుకో కారణాన్ని చెప్పవచ్చుననీ, నిందితులు ఫలానా దర్యాప్తు కావాలని కోరే హక్కు లేదన్నారు. చట్టాల ప్రకారం నిందితులకు కేసుల్ని కొట్టేయాలని కోరారు. పోలీసుల దర్యాప్తును అడ్డుకోవడానికి వీల్లేదన్నారు. కేసులో బీజేపీ పెద్దల పాత్ర ఉందన్నారు. సిట్ దర్యాప్తు లోతుగా. శాస్త్రీయంగా జరుగుతోందన్నారు. నిందితులకు హైకోర్టు రక్షణ కల్పించాల్సిన అవసరం లేదన్నారు. ముగ్గురు నిందితులే సుప్రీంకోర్టుకు వెళ్లారనీ, ఆ కేసును వెంటనే విచారణ పూర్తి చేయాలని చెప్పిందని వివరించారు. ఈ ఉత్తర్వులు ఇతరులకు కేసులకు కాదన్నారు. అన్ని రిట్ పిటిషన్లను డిస్మిస్ చేయాలనీ, సిట్ దర్యాప్తును వేగవంతం చేసేందుకు రాజ్యాంగం కల్పించిన హక్కులు కాపాడాలని కోరారు.'సిట్ దర్యాప్తు శాస్త్రీయంగా జరుగుతుందని ఆయన అన్నారు. నిందితులు హైకోర్టును రక్షణ కవచంలా వాడుకోవడం సరి కాదని చెప్పారు. సిట్ దర్యాప్తుపై స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు సైతం నిరాకరించిందని గుర్తు చేశారు.