Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హెచ్డిఎఫ్సి బ్యాంక్ వెల్లడి
హైదరాబాద్ : డిసెంబర్ 9న దేశ వ్యాప్తంగా 1,150 నగరాల్లో 5,500 రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేస్తున్నట్లు హెచ్డిఎఫ్సి బ్యాంక్ తెలిపింది. తమ కార్పొరేట్ సామాజిక బాధ్యత (సిఎస్ఆర్) కార్యక్రమంలో భాగంగా 2007 నుంచి నిర్వహిస్తున్న క్యాంపెయిన్లో ఇది 14వ రక్తదాన శిబిరమని పేర్కొంది. ఇందులో పెద్ద కార్పొరేట్ సంస్థలు, కళాశాలలు, బ్యాంకు శాఖల ప్రతినిధులు పాల్గొంటున్నారని పేర్కొంది. ఈ దఫా శిబిరంలో 4.5 లక్షల మంది రక్తదాతలు పాల్గొనే అవకాశాలున్నాయని ఆ బ్యాంక్ అంచనా వేసింది.