Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జన విజ్ఞాన వేదిక
నవతెంగాణ బ్యూరో - హైదరాబాద్
జన విజ్ఞాన వేదిక తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వరంలో చెకుముకి సైన్స్ సంబురాల-2022 (రాష్ట్ర స్థాయి సైన్స్ ఉత్సవాలు)ను ఈ నెల 9 నుంచి మూడు రోజుల పాటు సిరిసిల్ల పట్టణంలో నిర్వహించనున్నామని జేవీవీ రాష్ట్ర అధక్షులు డాక్టర్ కోయ వెంకటేశ్వర్ రావు తెలిపారు. ఈ సైన్స్ సంబురాలను మెదటిసారిగా ఉత్తర తెలంగాణ ప్రాంతంలో నిర్వహిస్తున్నందుకు చాల సంతోషంగా ఉందని చెప్పారు. మంగళవారం హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో సంబంధిత గోడ పత్రికను ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 8, 9, 10 తరగతుల విద్యార్థులు పాల్గొనే చెకుముకి సైన్స్ సంబురాలు (పాఠశాల, మండల, జిల్లా స్థాయి పోటీలు) నవంబర్ 18, 22, 27 తేదీల్లో జరిగాయని తెలిపారు.
పాఠశాల స్థాయి పోటీలో దాదాపు 8,500ల పాఠశాలలకు చెందిన 6,50,000 మంది విద్యార్థులు పాల్గొన్నారని తెలిపారు. దాదాపు 550 మండలాల్లో 30,000 మంది విద్యార్థులు మండల స్థాయిలో, 33 జిల్లాల్లో 6,000 మంది విద్యార్థులు జిల్లా స్థాయి లో పాల్గొన్నారని తెలిపారు. ప్రముఖ శాస్త్రవేత్తలు సీసీఎంబీ మాజీ డైరెక్టర్ డాక్టర్ సీ.హెచ్.మోహన రావు, సీడీఎఫ్ డీ డైరెక్టర్ డాక్టర్ కె.తంగరాజ్, నిమ్స్ మాజీ డైరెక్టర్ డాక్టర్ దాసరి ప్రసాద రావు, ఉస్మానియా యూనివర్సిటీ, హైదరాబాద్ యూనివర్సిటీ, బిట్స్ తదితర ప్రఖ్యాత విద్యా పరిశోధన సంస్థల నుంచి అనేక మంది మేధావులు సిరిసిల్లలో నిర్వహించబోయే సంబురాల్లో పాల్గొంటున్నారని చెప్పారు. రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మెన్ బోయినపల్లి వినోద్ కుమార్, జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి , ఎస్పీ రాహుల్ హెగ్డే, జడ్పీ చైర్మెన్, మున్సిపల్ చైర్మెన్, ప్రముఖ సంఘ సేవకులు రంగినేని మోహన రావు, కేంద్ర సాహిత్య అకాడెమి బాల సాహిత్య పురస్కార గ్రహీత డా పత్తిపాక మోహన్ తదితరులు పాల్గొంటారని తెలిపారు. ఈ సమావేశంలో జెవివి రాష్ట్ర నాయకులు ప్రొఫెసర్ బి.ఎన్.రెడ్డి, ప్రొఫెసర్ ఎం.ఆదినారాయణ, డాక్టర్ అందె సత్యం, ఆర్.వర ప్రసాద్, రాజా, ఎన్.వెంకట రమణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.