Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీపీసీసీ ఉపాధ్యక్షులు మల్లు రవి పిలుపు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
సోనియాగాంధీ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం గాంధీభవన్‌కు కార్యకర్తలు భారీ ఎత్తున తరలి రావాలని టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు మల్లురవి పిలుపునిచ్చారు. బోయినిపల్లిలోని గాంధీ ఐడియాలజీ కేంద్రంలో భారీ ఎత్తున రక్తదాన శిబిరం నిర్వహిస్తామని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అలాగే రాజీవ్ గాంధీ భీమా కింద ఏదైనా ప్రమాదంలో మరణించిన కాంగ్రెస్ సభ్యులకు చెక్కుల పంపిణీ చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షులు ఎంపీ రేవంత్ రెడ్డి, పార్టీ ముఖ్య నాయకులు పాల్గొంటారని తెలిపారు.
షర్మిల ఎవరు వదిలిన బాణమో అర్థమవుతుంది : వీహెచ్
వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షులు వైఎస్ షర్మిలకు మోడీ ఫోన్ చేశారంటేనే, ఆమె ఎవరు వదిలి బాణమో అర్థమవుతుందని మాజీ ఎంపీ వి హనుమంతరావు ఎద్దేవా చేశారు. షర్మిల మీద టీఆర్ఎస్ దౌర్జన్యం చేస్తే మోడీ ఫోన్ చేశారు గానీ, పంజాగుట్టలోని అంబేద్కర్ విగ్రహం గురించి షర్మిల ఎందుకు మాట్లాడలేదని ఒక ప్రకటనలో ప్రశ్నించారు.