Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పోస్టర్ ఆవిష్కరించిన మంత్రి సబిత
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రోపాధ్యాయ సంఘం (ఎస్టీయూ) టీఎస్ 75 వసంతాల వజ్రోత్సవ వేడుకలు ఈనెల 24,25 తేదీల్లో రంగారెడ్డి జిల్లా వనస్థలిపురంలోని ఎంఈ గార్డెన్లో జరగనున్నాయి. ఇందుకు సంబంధించిన పోస్టర్‌ను విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి గురువారం హైదరాబాద్‌లోని ఆమె ఛాంబర్లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎస్టీయూటీఎస్ అధ్యక్షులు జి సదానందంగౌడ్, ప్రధాన కార్యదర్శి ఎం పర్వత్‌రెడ్డి నేతృత్వంలో వినతిపత్రం సమర్పించారు. పాఠశాల విద్యాశాఖలో రోజుకో ప్రయోగం చేయడం సరైంది కాదని తెలిపారు. జియోట్యాగింగ్‌ను మానుకోవాలని కోరారు. లేదంటే ఉపాధ్యాయుల మానసిక ప్రశాంతతకు భంగం కలుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల షెడ్యూల్‌ను విడుదల చేయాలని సూచించారు. దీనికి స్పందించిన మంత్రి సబిత బదిలీలు, పదోన్నతుల షెడ్యూల్‌ను త్వరలో విడుదల చేస్తామంటూ హామీనిచ్చారని తెలిపారు. జియోట్యాగింగ్‌పై పునరాలోచన చేస్తామన్నారని వివరించారు. ఈ కార్యక్రమంలో ఎస్టీయూటీఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి బి భుజంగరావు, హైదరాబాద్ అధ్యక్ష, కార్యదర్శులు ఎండి ఇఫ్తాకర్, ఎం నరసింహ్మారెడ్డి, నాయకులు మహమ్మద్ అలీ, ప్రేమ్‌కుమార్, వెంకటేశ్వర్లు, ఎ సదయ్య, రమేష్‌కుమార్, తదితరులు పాల్గొన్నారు.