Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఈఎస్ఐ లబ్దిదారులకు వైద్య సేవలందించేందుకు ఆసక్తి ఉన్న ప్రయివేటు ఆస్పత్రులు దరఖాస్తు చేసుకోవాలని తెలంగాణ ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ (ఐఎంఎస్) ఆహ్వా నించింది. ఈ మేరకు ఐఎంఎస్ డైరెక్టర్ గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఆరు సెట్లతో కూడిన టెండర్ నోటిఫికేష న్ను విడుదల చేశారు. నాచారం, రామచంద్రాపురం, వరంగల్, సిర్ పూర్ కాగజ్నగర్లలో సెకెండరీ వైద్యసేవలను సీజీహెచ్ఎస్ రేట్లకు అందించాల్సి ఉంటుందని తెలిపారు.