Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రత్యేక ప్రార్థనల్లో హోం మంత్రి మహమూద్ అలీ
నవతెలంగాణ - భువనగిరి
యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలోని దర్గా హజరత్ జమాలే బాహెర్ ఉర్సు ఉత్సవాలకు గురువారం హోం మంత్రి మహమూద్ అలీ, రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మెన్ మసిఉల్లాV్‌ా ఖాన్ దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు సయ్యద్ అఫ్జల్ అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో హోం మంత్రి మాట్లాడుతూ.. దాదాపు 531 ఏండ్ల జమాలే బాహెర్ దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ నిండు నూరేండ్లు చల్లగా ఉండాలని ప్రత్యేకంగా ప్రార్థించినట్టు తెలిపారు. రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మెన్ మాట్లాడుతూ.. భక్తుల సౌకర్యార్థం బౌండ్రి వాల్ నిర్మాణం, నిజాం కాలం నాటి బావిని, దర్గాను అతి సుందరంగా తీర్చి దిద్దుతామన్నారు. అందుకు నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చారు.. జిల్లాలో అక్రమణకు గురైన వక్ఫ్ బోర్డు ఆస్తులను సర్వే నిర్వహించి స్వాధీనం చేసుకుంటామన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మెన్ ఎనబోయిన ఆంజనేయులు, దర్గా ముతవల్లి సిరాజ్ సిద్ధిఖి, శంషాబాద్ మున్సిపల్ కమిషనర్ సాబెర్ అలీ సదర్ ఖాజీ రిషత్ ఫాజిల్, జిల్లా వక్ఫ్ ప్రొటెక్షన్ కో ఆర్డినేషన్ ఆఫిషియల్ కమిటీ మెంబర్ ఎండీ ఇంతియాజ్. మైనారిటీ పట్టణ అధ్యక్షులు ఎండీ కాజమ్, తదితరులు పాల్గొన్నారు.