Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా వీరాంజనేయులు, వీఎస్ రావు
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
టీఎస్ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ (ఎస్‌డబ్ల్యూఎఫ్) నూతన ఆఫీస్ బేరర్స్ కమిటీ 19 మందితో ఎన్నికైంది. ఈనెల 10, 11 తేదీల్లో సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన ఫెడరేషన్ రాష్ట్ర తృతీయ మహాసభల్లో ఈ కమిటీని ఎన్నుకున్నారు. రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా వీరాంజనేయులు (మహబూ బ్‌నగర్-సెంటర్), వీఎస్ రావు (రాష్ట్ర కేంద్రం) నుంచి ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా సీహెచ్ రాంచందర్ (వరంగల్), కే గీత (సికింద్రాబాద్), ఎమ్ ప్రభాకర్ (మహబూబ్‌నగర్), ఎస్ కృష్ణ (హైదరాబాద్), బిక్షపతిగౌడ్ (రాష్ట్ర కేంద్రం), ఏవీ రావు (రాష్ట్ర కేంద్రం), ఏ వెంకటేశ్వర్లు (ఖమ్మం) ఎన్నికయ్యారు. ఉప ప్రధాన కార్యదర్శిగా గడ్డం లింగమూర్తి (ఖమ్మం), కార్యదర్శులుగా జీఆర్ రెడ్డి (గ్రేటర్ హైదరాబాద్ జోన్), జే పద్మావతి (ఖమ్మం), బీ సుధాకర్ (నల్లగొండ), టీ ఎల్లయ్య (వరంగల్), ఎమ్ భీమ్రావ్ (ఆదిలాబాద్), పీ చంద్రప్రకాశ్ (హైదరాబాద్), కేఎస్‌రెడ్డి (జెడ్డబ్ల్యూఎస్, ఉప్పల్), ప్రచార కార్యదర్శిగా పోరెడ్డి రవీందర్‌రెడ్డి (రాష్ట్ర కేంద్రం), కోశాధికారిగా కుడిదల గంగాధర్ (హెడ్ ఆఫీస్) ఎన్నికయ్యారు.
8 తీర్మానాలకు ఆమోదం
ఆర్టీసీ కార్మికులకు సంబంధించిన 8 తీర్మానాలను రెండోరోజైన ఆదివారంనాడు మహాసభ ఆమోదించింది. 'కార్మికుల హక్కులకు భంగం కలిగిస్తున్న కొత్త లేబర్ కోడ్లు రద్దు చేయాలి' అనే తీర్మానాన్ని ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి పీ రవీందర్‌రెడ్డి మహాసభలో ప్రవేశపెట్టారు. దీన్ని ఖమ్మం రీజియన్ నాయకులు గుండు మాధవరావు బలపర్చారు. 'ఆర్టీసీని విస్తరించి, బడ్జెట్లో రెండు శాతం నిధులు కేటాయించాలి' అనే తీర్మానాన్ని ఫెడరేషన్ ఉపాధ్యక్షురాలు కే గీత ప్రవేశపెట్టగా, వరంగల్ రీజియన్ కార్యదర్శి ఎల్లయ్య బలపరిచారు. 'డబుల్ డ్యూటీకి డబుల్ వేతనం చెల్లించాలి' అనే తీర్మానాన్ని రాష్ట్ర కార్యదర్శి బీ బిక్షపతి ప్రవేశపెట్టగా, నల్గొండ రీజియన్ కార్యదర్శి సుధాకర్ బలపరిచారు. 'స్క్రాప్ బస్సులు తొలగించి, కొత్తవి ప్రవేశపెట్టాలి. ప్రయాణీకుల అవసరాలకు తగినన్ని బస్సుల్ని నడపాలి' అనే తీర్మానాన్ని నల్గొండ రీజియన్ కార్యదర్శి సుధాకర్ ప్రవేశపెట్టగా, కరీంనగర్ రీజియన్ కార్యదర్శి శ్రీనివాస్ బలపరిచారు. 'అద్దెబస్సులు రద్దు చేయాలి-ఆర్టీసీ బస్సులు పెంచాలి. ఆర్టీసీలోని ఖాళీలను రిక్రూట్మెంట్ ద్వారా భర్తీచేసి, అర్హులైన వారికి ప్రమోషన్లు ఇవ్వాలి' అనే తీర్మానాన్ని హైదరాబాద్ రీజియన్ అధ్యక్షులు కృష్ణ ప్రవేశపెట్టగా, రాష్ట్ర ఉపాధ్యక్షులు పీ మల్లయ్య బలపరిచారు.
'గ్యారేజ్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి. అవసరమైన స్పేర్స్, టూల్స్ సప్లరు చేయాలి' అనే తీర్మానాన్ని నల్గొండ అధ్యక్షులు కే నర్సింహా ప్రవేశపెట్టారు. 'టీఎస్ఆర్టీసీలో పనిభారాలు తగ్గించాలి. కార్మిక చట్టాలు అమలు చేయాలి' తీర్మానాన్ని గ్రేటర్ హైదరాబాద్ జోనల్ కార్యదర్శి జీఆర్ రెడ్డి ప్రవేశపెట్టగా, అదే జోనల్ అధ్యక్షులు చంద్రప్రకాశ్ బలపరిచారు. 'టీఎస్ ఆర్టీసీ కార్మికుల ఆర్ధిక అంశాలు వెంటనే పరిష్కరించాలి' అనే తీర్మానాన్ని ఆదిలాబాద్ రీజియన్ కార్యదర్శి ఎమ్బీ రావు మహాసభలో ప్రవేశపెట్టగా, వనపర్తి డిపో నాయకులు స్వామి బలపర్చారు.