Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లాకో మెడికల్ కాలేజీ : హరీశ్‌రావు
హైదరాబాద్: ప్రజలకు సమీపంలోనే స్పెషాలి టీ వైద్యాన్ని చేరువ చేయాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ జిల్లాకో మెడికల్ కాలేజీని ఏర్పాటు చేస్తున్నారని, అనవసరంగా పేషెంట్లను ఇతర ఆసుపత్రులకు రిఫర్ చేయొద్దని, అక్కడే మంచి వైద్యం అందించాలని మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు. వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వి, డీఎంఈ రమేశ్ రెడ్డి, టీఎస్ఎంఐడీసీ ఎండీ చంద్రశేఖర్ రెడ్డి, టీవీవీపీ కమిషనర్ అజరు కుమార్‌తో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఆస్పత్రుల్లో 56 టిఫా స్కానింగ్ మిషన్లు ఏర్పాటు చేశామని, వీటితో అన్ని రకాల పరీక్షలు గర్భిణులకు ఆసుపత్రుల్లో అందేలా చూడాలన్నారు.ఇన్ఫెక్షన్ కంట్రోల్ యూనిట్ అన్ని ఆసుపత్రుల్లో ఏర్పాటు చేశామని, ప్రతీ సోమవారం ఆర్ఎంవోలు, సూపరిడెంట్లు సమావేశమై ఇన్ఫెక్షన్ కంట్రోల్‌పై సమీక్ష జరిపి, అవరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇప్పటికే ఇన్ఫెక్షన్ కంట్రోల్ ఆఫీసర్‌ను నర్సును గుర్తించి వారికి నిమ్స్‌లో శిక్షణ ఇచ్చినట్లు చెప్పారు. ప్రతీ హాస్పిటల్లో ఇన్ఫెక్షన్ సమస్యలు రాకుండా పకడ్బందీగా పని చేయాలని, అన్ని ఆసుపత్రులకు ఎయిర్ శాంపిలర్స్ పంపించినట్లు వివరించారు. ఎయిర్ చెకింగ్ తో పాటు, స్టెరిలైజేషన్ విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం వహించొద్దని, డిచ్ఛార్జ్ సమయంలో వైద్యులు రాసిన మందులు అన్నీ ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇచ్చే పంపాలని ఆదేశించారు.
రోగులు డబ్బులు పెట్టి బయట కొనుక్కునే పరిస్థితి ఉండొద్దని, ప్రతి ఆసుపత్రిలో మూడు నెలల బఫర్ స్టాక్ మెయింటైన్ చేయాలని స్పష్టం చేశారు. దీనిపై ఆర్ఎంవోలు, సూపరిడెంట్లు ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. అన్ని వేళల్లో అవసరమైన వైద్యులు, నర్సింగ్ స్టాఫ్ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని, అత్యవసర సేవల విభాగంలో కూడా వైద్య సిబ్బంది తగిన రీతిలో ఉండాలన్నారు. ఎస్‌ఆర్‌ల సేవలు సద్వినియోగం చేసుకోవాలని, వైద్యపరికరాలు పాడయితే వెంటనే వాటిని గంటల్లోనే రిపేర్ చేసేలా పీఎంయూ విధానం తీసుకువచ్చామన్నారు.మెడికల్ పరికరాలు పాడయితే ఫోన్ ద్వారా లేదా ఈమెయిల్ ద్వారా సమాచారం వస్తే వెంటనే వాటిని రిపేర్ చేస్తున్నామన్న మంత్రి.. వీటిని ఉపయోగించుకోవాలన్నారు. అన్ని వైద్య పరికరాలు పూర్తి వినియోగంలో ఉండాలని, సంబంధిత నిర్వహణ ఏజెన్సీకి ఆన్లైన్లో విషయం తెలియజేయాలన్నారు. నిర్దేశిత సమయంలో రిపేర్ అయ్యేలా చూడాలని, ప్రతీ ఆసుపత్రిలో నిబంధనల మేరకు రాత్రివేళ పోస్టుమార్టం చేయాలన్నారు. హర్ సే వెహికిల్ అందుబాటులో ఉంచి, ఉచితంగా గమ్యం చేయాలన్నారు. టీచింగ్ హస్పిటల్స్‌కు 800 మంది సీనియర్ రెసిడెంట్లను పంపామని, ప్రతీ ఆసుపత్రికి 25 నుంచి 30 మంది ఎస్‌ఆర్‌లు కేటాయించడం జరిగిందన్నారు. సేవలుప్రణాళికా బద్ధంగా వినియోగించుకో వాలని, అవసరం లేని సీ-సెక్షన్ ఆపరేషన్లు జరగకుండా చూడాలన్నారు. వైద్యులు సూచన మేరకే సీ-సెక్షన్ జరగాలని, బర్త్ ప్లాన్ సరిగా నిర్వహించాలని సూచించారు. గర్భిణులు చేయాల్సిన ఎక్సర్ సైజ్లు సక్రమంగా చేసేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. అందుకు సంబంధించిన వీడియోలు చూసే ఏర్పాటు చేయాలని ఆదేశించారు. హౌల్ బ్లాక్ వినియోగించ డం కాకుండా కాంపోనేంట్గా విడదీసి ఎక్కువ మందికి వినియోగించేలా చూడాలని, ఇటీవల కాలంలో గాల్ బ్లాడర్ స్టోన్స్ సమస్య కేసులు ఎక్కువగా వస్తున్న నేపథ్యంలో మరింత ఖచ్చితత్వం తో సులువుగా చికిత్స అందించేందుకు అవసరమైన అధునాతన చికిత్స విధానాలు అందిపుచ్చుకోవాల న్నారు. గాంధీ, ఉస్మానిచా వైద్యులు ఆ దిశగా ఆలోచన చేయాలని మంత్రి ఆదేశించారు.