Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆమెయ్ ఆమ్లెడి, ఉన్నికృష్ణన్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కరోనా తర్వాత తిరిగి పర్యాటక, ఆతిథ్య రంగం పుంజుకుందని అక్బర్ ట్రావెల్స్ ఆఫ్ ఇండియా ప్రయివేట్ లిమిటెడ్ సీఈఓ అమెయ్ ఆమ్లడి, వైస్ ప్రెసిడెంట్ ఉన్ని కృష్ణన్ తెలిపారు. సోమవారం హైదరాబాద్ అక్బర్ ట్రావెల్స్ 141వ కార్యాలయాన్ని వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గల్ఫ్‌తో పాటు ఇతర దేశాలు, రాష్ట్రాల్లో తమ కార్యాలయాలు ఉన్నందున అంతర్జాతీయ పర్యటనకు అవసరమైన సౌకర్యాలను మెరుగ్గా అందించగలుగుతున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆ ట్రావెల్స్ తెలంగాణ జనరల్ మేనేజర్ అనితాసింగ్ తదితరులు పాల్గొన్నారు.