Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రేవంత్ రెడ్డి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కల్వకుంట్ల కుటుంబానికి కర్రుకాల్చి వాత పెట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి హెచ్చరించారు. ఈ మేరకు సోమవారం ఆయన ట్వీట్ చేశారు. అరచేతిలో వైకుంఠం చూపించడంలో కేసీఆర్ ఆరితేరిపోయారని విమర్శించారు. ఒక వాసాల మర్రేమిటి... మొత్తం తెలంగాణ కేసీఆర్ మాయ మాటలతో మోసపోయిందని తెలిపారు. ఎనిమిదేండ్లుగా కేసీఆర్ మాటలు వినీ వినీ ప్రజలు విసిగిపోయారని పేర్కొన్నారు.