Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
దేశంలోనే సంచలనం రేపిన ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నిందితులైన రామచంద్ర భారతీ, సింహయాజి స్వామి లు సోమవారం సిట్ అధికారుల ఎదుటకు వచ్చి సంతకాలు చేశారు. ఈ ఇద్దరు నిందితులకు బెయిల్ మంజూరు చేసిన సమయంలో ప్రతివారమూ వచ్చి దర్యాప్తు సంస్థ సిట్ అధికారుల ఎదుట వారు సంతకాలు చేయాలని కోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ మేరకు ప్రతి సోమవారం రామచంద్రభారతి, సింహయాజీ స్వామిలు ఇద్దరూ సిట్ ఎదుట వచ్చి సంతకాలు చేస్తున్నారు. కాగా, ఈ కేసులో మరో నిందితుడు నందకుమార్ బంజారాహిల్స్ పోలీసు స్టేషన్కు సంబంధించి మరో కేసులో నిందితుడై జైళ్లో ఉన్నారు.