Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వికలాంగుల కార్పొరేషన్ చైర్మెన్ డాక్టర్ కే వాసుదేవరెడ్డి
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
రాజకీయ కుట్రలో భాగంగానే ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై బీజేపీ ప్రభుత్వం అక్రమ కేసులు బనాయిస్తున్నదని రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్ చైర్మెన్ డాక్టర్ కే వాసుదేవరెడ్డి అన్నారు. ఈ మేరకు సోమవారంనాడాయన ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఢిల్లీ మద్యం కేసులో ఏ సంబంధం లేని కల్వకుంట్ల కవితపై బలవంతంగా అభియోగాలు మోపుతున్నారనీ, అందులో భాగంగానే సీబీఐ, ఈడీ, ఐటీ కేసులు బనాయించే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. ఢిల్లీ మద్యం కేసుతో తమ ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్ చెప్పారనీ, అలాంటప్పుడు కవితకు ఏం సంబంధమని ప్రశ్నించారు. బీజేపీ ప్రభుత్వం కావాలనే సీఎం కేసీఆర్ కుటుంబాన్ని బద్నాం చేస్తూ, బెదిరిస్తున్నదని చెప్పారు. తెలంగాణలో ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సాక్ష్యాల తో సహా అడ్డంగా దొరికిన స్వాములు కోర్ట్ స్టేతో తిరుగుతున్నా రన్నారు. ఈ కేసులో ప్రధాన ముద్దాయి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్‌కి 41 సీఆర్పీ కింద నోటీసులు జారీ చేస్తే కోర్టుస్టేతో చట్టాలను అడ్డం పెట్టుకొని హాజరుకాకుండా తప్పించుకు తిరుగుతున్నారని విమర్శించారు.