Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మెన్ బోయినపల్లి వినోద్‌కుమార్
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
రైౖల్వే శాఖలో ఖాళీగా ఉన్న 3,15,823 ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మెన్ బోయినపల్లి వినోద్‌కుమార్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ ఖాళీల్లో దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 17,134 పోస్టులు ఉన్నాయని తెలిపారు. ఈ విషయాలను రాజ్యసభలో కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్ వెల్లడించారని
సోమవారంనాడొక పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్రం నుంచి ఎన్నికైన నలుగురు బీజేపీ ఎంపీలు ఈ ఖాళీల భర్తీని ఎందుకు పట్టించుకోవట్లేదని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీ కోసం పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నోటిఫికేషన్స్ జారీ చేస్తూ ఉద్యోగ నియామకాల ప్రక్రియను వేగవంతం చేసిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.