Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
హైదరాబాద్ మేనేజ్మెంట్ అసోసియేషన్(హెచ్ఎంఏ) ను డిఫెన్స్ అధికారుల బృందం సోమవారం సందర్శించింది. ఉన్నత రక్షణ నిర్వహణ కోర్సులో భాగంగా హెచ్డీఎంసీకి ఎనిమిది మంది కోర్స్ ఆఫీసర్స్ మేనేజ్మెంట్ ఎడ్యుకేషన్ టూర్ చేపట్టారు. తొమ్మిది మంది ఆర్మీ, నలుగురు ఎయిర్పోర్స్, ఇద్దరు నేవీ సీనియర్ అధికారులు హెచ్ఎంఏకు వచ్చారు. కోర్సు పాఠాల్లో భాగంగా ప్రయివేటు, ప్రభుత్వ రంగ సంస్థల నిర్వహణ ఎలా చేయాలో ఈ సందర్భంగా అధ్యయనం చేశారు. దీనికి కెప్టెన్ నారాయణన్, కెప్టెన్ హరినాథ్ నాయకత్వం వహించారు. హెచ్ఎంఏ అధ్యక్షులు రాంచందర్ 58 ఏళ్ల అసోసియేషన్ గురించి, నిర్వహణ గురించి డిఫెన్స్ అధికారుల బృందానికి పలు విషయలు వివరించారు. విద్యార్థుల గ్రాస్ రూట్ నుంచే సంస్థల గురించి నేర్చుకో వాలని సూచించారు. హెచ్ఎంఏకు అనేక అవార్డులు వచ్చినట్టు చెప్పారు. ఈ సంవత్సరం 50 ఏండ్ల ఉత్సవా లను జరుపుకోనున్నట్టు తెలిపారు. హెచ్ఎంఏ క్యాంపస్, కార్పొరేట్ల మధ్య వారధిగా ఉంటుందన్నారు.