Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
ఆదాయం చెల్లింపు విషయంలో అవకతవకలకు పాల్పడుతన్నారనే అరోపణలపై ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీస్ కార్యాలయంపై సోమవారం ఆదాయపు పన్నుతో పాటు జీఎస్టీ అధికారులు దాడులు నిర్వహించారు. హైదరాబాద్‌లోని మైత్రి మూవీస్ కార్యాలయంతో పాటు నిర్మాతలు నవీన్, రవిశేఖర్ నివాసా ల్లోనూ ఐటీ, జీస్టీ అధికారులు సోదా లు నిర్వహించారు.
ఈ సంస్థలకు చెందిన నాలుగు బృందాలు ఉదయమే మైత్రి మూవీస్ కార్యాలయాలకు వచ్చి సోదాలు ప్రారంభించాయి. అగ్రశ్రేణి సినీనటులతో పలు సినిమాలు తీసిన మైత్రి మూవీస్ తాజాగా, చిరంజీవితో వాల్తేరు వీరయ్య, బాలకృష్ణతో వీర సింహారెడ్డి చిత్రాలు నిర్మించి సంక్రాంతి సందర్భంగా విడుదల చేస్తున్నది. అంతేగాక, పవన్‌కళ్యాణ్‌తో వస్తాద్, భగత్‌సింగ్ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నది. ఈ మొత్తం ప్రాజెక్టులు కలిపి దాదాపు ఏడు వందల కోట్ల రూపాయలుగా ఉన్నదనీ ఆదాయపు పన్ను శాఖ, జీఎస్టీ అధికారులు అంచనా వేస్తున్నా రు. ఈ పెట్టుబడులు ఎక్కడ నుంచి ఎలా వస్తున్నాయి? ఎలా వినియోగి స్తున్నారు? మొదలైన అంశాలపై దృష్టి ని సారించిన అధికారులు ప్రభుత్వానికి పన్ను చెల్లింపు విషయంలో మైత్రి మూవీస్ నిర్మాతలు చట్టబద్ధంగా వ్యవ హరించటం లేదని అనుమానిస్తున్నా యి. ఈ నేపథ్యంలోనే పన్ను ఎగవేత కు పాల్పడ్డారనే విషయ మై ఈ సోదా లలో నిగ్గు తేల్చటానికి అధికారులు ప్రయత్నిస్తున్నట్టు తెలిసింది. ఉదయం ప్రారంభమైన సోదాలు రాత్రి పొద్దు పోయేంత వరకు కొనసాగాయి.