Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పునర్వీవ్యవస్థీకరణతో నూతనోత్సాహం
- ప్రగతిభవన్ కేంద్రంగా ఎలిక్ట్రికల్ సబ్‌డివిజన్
- ఢిల్లీ నుంచి మంత్రి రాగానే జీవోలు
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ పునర్వీవ్యవస్థీకరణకు భారీ కసరత్తు జరుగుతున్నది. గత శనివారం నాటి క్యాబినెట్ భేటీలో ఆర్‌అండ్‌బీలో అధికార వికేంద్రీకరణ జరగాలంటూ అదనంగా పోస్టులు మంజూరు చేస్తూ నే నిధులు సైతం కేటాయించడం ఇం దుకు కారణం. దీంతో శాఖ పునర్వీవ్య వస్థీకరణ కోసం ఆర్ అండ్ బీ ఉన్న తాధికారులు ఇప్పటికే ఆ పనిలో నిమ గమయ్యారు.
ఆ శాఖ కార్యదర్శి శ్రీని వాసరాజుతోపాటు ఇంజినీర్ ఇన్ చీఫ్ లు గణపతిరెడ్డి, రవీందర్రావు ఇరువు రు శాఖాపరంగా అధికారులతో భేటి లు ప్రారంభించారు. విస్త్రృత సంప్రది ంపులు చేస్తున్నారు. జిల్లాల నుంచి ఎస్ఈలు, సీఈలను పిలిపించి సోమ వారం హైదరాబాద్‌లో వరుస సమా వేశాలు నిర్వహించారు. భవనాలతో పాటు రాష్ట్ర రోడ్లకు సంబంధించి అధి కార వికేంద్రీకరణ ఎలా ఉండాలనే అంశాలపై చర్చించారు.ప్రక్రియ దాదా పు ఒక కొలిక్కి వచ్చినట్టు సమాచారం. ఢిల్లీలో బీఆర్ఎస్ ఆఫీసు కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన డానికి వెళ్లిన మంత్రి వేముల ప్రశాం త్‌రెడ్డి రాగానే దీనికి ముగింపు పలికే అవకాశాలు ఉన్నాయి. అప్పుడే జీవోలు సైతం జారీ అయ్యే అవకాశాలు ఉన్నా యి. సీఎంతోపాటు ఢిల్లీకి వెళ్లిన ప్రశా ంత్‌రెడ్డి ఇప్పటికే ఓ సీఎం ఆదేశాల మేరకు ఒక దఫా ఉన్నతాధికారుతో వికేంద్రీకరణపై చర్చించినట్టు తెలిసిం ది. ఈమేరకు కిందిస్థాయిలో చర్చించి చర్యలు తీసుకోవాలని కార్యదర్శికి ఆదేశాలు ఇచ్చినట్టు సమాచారం. ఆ నేపథ్యంలో కార్యదర్శి శ్రీనివాసరాజు భవనాల విభాగం అధికారులతో తొలు త భేటి అయ్యారు. అనంతరం రోడ్ల విభాగం అధికారులతోనూ సమావేశ మయ్యారు. పెరిగిన పోస్టులు 472 కాగా, వాటిని ఎక్కడా, ఎలా సర్దు బాటు చేయాలనే విషయమై లోతుగా చర్చించారు. ప్రజారవాణాను పటిష్టం చేసేందుకు రాష్ట్రంలోని రోడ్లకు మర మ్మతులు చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించిన సంగతి తెలిసిందే. అంతే గాక గత మంత్రివర్గ సమావేశంలోనే రూ.635 కోట్లు కేటాయించారు. అలాగే 472 అదనపు పోస్టుల్లో కొత్త గా మూడు సీఈ, 12 ఎస్ఈ, 13 ఈఈ, 102 డిఈఈ, 163 ఏఈఈ, 28 డివిజినల్ అక్కౌంట్స్ అధికారుల తోపాటు టెక్నికల్, నాన్‌టెక్నికల్ సిబ్బ ంది పోస్టులున్న విషయం విదితమే. వీటిని జిల్లాల్లో ప్రాంతాల వారీగా, హైదరాబాద్‌లో పని ఆధారంగా పరి శీలించి పోస్టులను కేటాయించాలని ఉన్నతాధికారులు ప్రాథమికంగా ఒక నిర్ణయానికి వచ్చారు.
అలాగే ఇప్పటికే సర్వీసులో ఉన్న సీనియర్ ఇంజినీర్లు, అధికారులకు ఉద్యోగోన్నతులు కల్పిం చాలని మంత్రివర్గం ఆదేశించిన తరు ణంలో ఆ కసరత్తు కూడా ప్రారంభ మైంది. దీంతో సీఎం చిత్రపటానికి పాలాభిషేకాలు చేస్తున్నారు. భవ నాలు, రోడ్లు, జాతీయ రహాదారులకు సంబంధించిన విభాగాల్లో మూడు సీఈ, 10 సర్కిల్, 13 డివిజినల్, 79 సబ్ డివిజినల్ కార్యాలయాలను ఏర్పా టు చేసేందుకు ఇప్పటికే క్యాబినెట్ అంగీకరించింది. ఈ తరుణంలో ఆర్‌అండ్‌బీలో ప్రగతిభవన్ కేంద్రంగా ఎలక్ట్రికల్ సబ్‌డివిజన్‌ను ఏర్పాటు చేసేందుకు ఉన్నతాధికారులు ప్రతిపా దించారు. ఒకవైపు ఈ కసరత్తు జరు గుతుండగానే, మరోవైపు భిన్నమై న వ్యాఖ్యానాలు ఉద్యోగుల నుంచి వినిపి స్తున్నాయి. పోస్టుల పెంపు ఒక ఎత్త యితే, నిధులను సమకూర్చడం కూడా కీలకమేనని అంటున్నారు. 'ఎంత పని అయినా చేయడానికి సిద్ధం, అసలు కావాల్సింది సొమ్ములు' అని అబిప్రాయ పడుతుండటం కొసమెరుపు.